“ఫ్యామిలీ ఫ్యామిలీ అని చెప్పి క్లైమాక్స్‌లో ఇలా చేశారేంటి..?” అంటూ… విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” సినిమా మీద వ్యాఖ్యలు..! ఈ సీన్ గమనించారా..?

“ఫ్యామిలీ ఫ్యామిలీ అని చెప్పి క్లైమాక్స్‌లో ఇలా చేశారేంటి..?” అంటూ… విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” సినిమా మీద వ్యాఖ్యలు..! ఈ సీన్ గమనించారా..?

by Harika

Ads

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా గత వారం విడుదల అయ్యింది. ఎన్నో భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. గోవర్ధన్ అనే ఒక మధ్య తరగతి మనిషి చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. సినిమా పాటలు సినిమా రిలీజ్ అయ్యే ముందు హిట్ అయ్యాయి. దాంతో సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తెలుగుతో పాటు, తమిళ్ లో కూడా విడుదల చేశారు. హిందీలో కూడా ఈ సినిమా విడుదల అవుతుంది అని చెప్పారు. కానీ ఎప్పుడు విడుదల అవుతుంది అనేది ప్రకటించలేదు.

Video Advertisement

family star review telugu

సినిమాలో కొన్ని సీన్స్ మీద బాగా కామెంట్స్ వచ్చాయి. ముఖ్యంగా హీరో తన కుటుంబానికి ప్రాముఖ్యత ఇస్తాడు కానీ, కొన్ని చోట్ల అదే లాజిక్ మిస్ అవుతాడు అన్నట్టు చూపించారు. సినిమా మొదటి నుండి చివరి వరకు హీరోకి తన కుటుంబం అంటే చాలా ఇష్టం అన్నట్టే చూపించారు. హీరో తనకంటే తన కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు అన్నట్టు సీన్స్ రూపొందించారు. తన కోసం కాదు. తన కుటుంబం కోసం హీరో బతుకుతాడు అన్నట్టు హీరో పాత్ర డిజైన్ చేశారు. కానీ చివరికి వచ్చేటప్పటికి ఇదంతా కూడా మిస్ అయినట్టు అనిపిస్తుంది.

అందుకు కారణం సినిమా చివరిలో హీరో, హీరోయిన్ పెళ్లి అవుతుంది. సినిమా రిలీజ్ అయ్యే ముందు ఇది ఒక డ్రీమ్ లో వచ్చే పాట అని అనుకున్నారు. కానీ సినిమాలో చూసిన తర్వాత చివరిలో హీరోకి పెళ్లి జరుగుతుంటే చుట్టుపక్కల అతని కుటుంబం ఉండదు. హీరో జీవితంలో అది ఒక ముఖ్యమైన విషయం. అలాంటిది అవుతున్నప్పుడు కూడా హీరో చుట్టుపక్కల తన కుటుంబానికి చెందిన వారు ఉండరు. సినిమా మొత్తం చూపించిన మెసేజ్ ని ఒకే ఒక్క క్లైమాక్స్ తో మార్చేశారు. కుటుంబం అంటే అంత ఇష్టం ఉన్న వ్యక్తి కుటుంబం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు అన్నట్టు చూపించారు. దాంతో ఈ సీన్ చూసిన వాళ్ళు ఈ సీన్ మీద కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ : GEETHANJALI MALLI VACHINDI REVIEW : “అంజలి” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like