సిరాజ్ ఈ పద్ధతి మార్చుకోకపోతే ఓడిపోతాం ఏమో..? విషయం ఏంటంటే..?

సిరాజ్ ఈ పద్ధతి మార్చుకోకపోతే ఓడిపోతాం ఏమో..? విషయం ఏంటంటే..?

by Mounika Singaluri

Ads

2023 వండే ప్రపంచ కప్ లో భారత జట్టు ప్రదర్శన చాలా బాగుంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ లలో భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇక వరల్డ్ కప్ భారత్ కైవసం చేసుకోవాలంటే రెండు మ్యాచ్ ల దూరం ఉంది. 16వ తారీఖున న్యూజిలాండ్ తో జరిగే సెమీఫైనల్ లో గెలిస్తే 19వ తారీఖున జరిగే ఫైనల్ మ్యాచ్ భారత్ ఆడనుంది. ఇక ఇదే ప్రదర్శన, ఫామ్ కొనసాగిస్తే భారత్ జట్టు కప్పు గెలవడం పెద్ద కష్టమేమీ కాదు.

Video Advertisement

అయితే భారత్ అభిమానులను సెమీఫైనల్ గండం భయపెడుతుంది. ఇలాంటి సమయంలో భారత జట్టులో ఉన్న ఏ ఒక్క ఆటగాడు అయినా సరే ఏ చిన్న తప్పు చేసిన జట్టు మొత్తం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు భారత్ అభిమానులు ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ పైన ఆవేశ పడుతున్నారు. దానికి కారణం లేకపోలేదు.

బౌలింగ్ లో అద్భుతంగా రానిస్తున్న సిరాజ్ ఫీల్డింగ్ లో మాత్రం తప్పు మీద తప్పు చేస్తున్నాడు. మొన్న నెథర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో రెండు క్యాచ్ లను వదిలేసాడు. మొత్తం భారత్ ఆడిన చివరి రెండు మ్యాచ్ లలో సిరాజ్ మూడు క్యాచ్ లి వదిలేశాడు.ఎలా చూసుకున్నా ఫీల్డింగ్ విషయంలో సిరాజ్ పేలవంగం ఉన్నాడు.బౌండరీ దగ్గర బంతిని ఆపడానికి కూడా కష్టపడుతున్నాడు. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ లో కూడా ఇదే విధంగా తన తీరు ఉంటే టీం మొత్తానికి ఇది నష్టం చేకూరుస్తుంది.పాకిస్తాన్-ఆస్ట్రేలియా మ్యాచ్ లో వార్నర్ ఇచ్చిన క్యాచ్ ను పాకిస్తాన్ ఫీల్డర్ ఒసామా వదిలేసాడు.

ఆ తర్వాత అది పాకిస్తాన్ కి ఎంత నష్టం చేసిందో తెలిసిందే. పది పరుగుల వద్ద అవుట్ అవ్వాల్సిన వార్నర్ ఏకంగా 163 పరుగులు చేశాడు.సెమీఫైనల్ ముందు సిరాజ్ కి ఫీల్డింగ్ కోచ్ ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. భారత్ 2011 తర్వాత వరల్డ్ కప్పునెగ్గలేదు కాబట్టి ఈసారి ఎలాగైనా సరే కప్పు కొట్టాలని దేశం మొత్తం కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఏ చిన్న తప్పు చేసిన ఆ ప్లేయర్ కి తీవ్ర నష్టం చేకూర్తుంది. సిరాజ్ ఫీల్డింగ్ లో మెరుగైతే ఎటువంటి దొఖా ఉండదు.

Also Read:ఇదే మొదటిసారి అన్నట్టు అంత బిల్డప్ ఇచ్చారుగా “పాక్”..కానీ 2003 నుండి ఈ లెక్కలు చూడండి.


End of Article

You may also like