“అప్పుడు ఇబ్బంది అనిపించిన విషయం… ఇప్పుడు గుర్తు రాలేదా..?” అంటూ… “సమంత” పై కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

“అప్పుడు ఇబ్బంది అనిపించిన విషయం… ఇప్పుడు గుర్తు రాలేదా..?” అంటూ… “సమంత” పై కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

by kavitha

Ads

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం నటిస్తున్న మూవీ ‘ఖుషి’. ఈ మూవీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ‘నా రోజా నువ్వే’ అనే పాట యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా నుండి మరో పాట విడుదల అయ్యింది.

Video Advertisement

‘ఆరాధ్య’ పేరుతో రిలీజ్ అయిన ఈ పాట ఇప్పటికే 3 మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ సాంగ్ లో విజయ్ దేవరకొండ, సమంతల మధ్య కెమిస్ట్రీ, పిక్చరైజేషన్, లిరిక్స్, ట్యూన్ అన్ని బాగున్నాయని టాక్. కానీ ఈ పాటలోని ఒక సన్నివేశం వల్ల సమంత పై సోషల్ మీడియాలో నెటిజెన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సమంత ప్రస్తుతం ఖుషి మూవీ మరియు సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ రెండింటి చిత్రీకరణ దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. సమంత తన హెల్త్ గురించి ఓ సంవత్సరం పాటు సినిమాల నుండి బ్రేక్ తీసుకోవాలని భావించిందని కొన్నిరోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆమె నటించిన ఖుషి మూవీ సెప్టెంబరు 1న రిలీజ్ కానుంది. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పాటలు ఆకట్టుకుంటున్నాయి.
ఖుషి నుండి రిలీజ్ అయిన ‘ఆరాధ్య’ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. అదే సమయంలో ఆ పాటలోని ఒక సీన్ సమంత పై ట్రోలింగ్ కారణం అయ్యింది. ఈ పాటలో ఓ సీన్ లో విజయ్ దేవరకొండ తన కాలితో సమంత కుడి చేతి పై తాకినట్లుగా ఒక స్టిల్ ఉంది. ఈ స్టిల్ ను చూసిన కొందరు నెటిజన్స్, సమంత గతంలో ఒక మూవీ పై చేసిన ఓల్డ్ ట్వీట్ ని ఇప్పుడు బయటికి తీశారు.
ఆ ట్వీట్ లో సమంత ‘ఇంకా విడుదల కానీ ఓ మూవీ పోస్టర్ చూశాను. నా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి’ అంటూ రాసుకొచ్చింది. అయితే ఆ పోస్టర్ మహేష్ బాబు నటించిన ‘నేనొక్కడినే’ మూవీ పోస్టర్ అని అప్పట్లో చాలామంది అన్నారు. అపుడు గుర్తు వచ్చింది నీకు, మరి నీ మూవీ టైమ్ కి గుర్తు రాలేదా అంటూ నేనొక్కడినే పోస్టర్ ని, ఖుషి ఫొటోని కూడా పక్కపక్కన పెట్టి మరి నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read: తెలుగు “పోకిరి” లో విలన్ రోల్…హిందీ రీమేక్ లో హీరో రోల్ ని వదులుకున్న ఆ నటుడు ఎవరో తెలుసా.?


End of Article

You may also like