Home Filmy Adda “ఈ ఒక్క విషయం తేడా కొట్టింది..!” అంటూ… చిరంజీవి “భోళా శంకర్” పై కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

“ఈ ఒక్క విషయం తేడా కొట్టింది..!” అంటూ… చిరంజీవి “భోళా శంకర్” పై కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

by Mohana Priya

సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత వాల్తేరు వీరయ్య రూపంలో భారీ హిట్ అందుకున్న చిరు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ టీజర్ ఎంతో కోలాహలంగా రిలీజ్ అయింది.

చిరంజీవి నుంచి మంచి మాస్ ట్రీట్ వస్తుంది అని ఎంతో ఆశతో ఎదురుచూసిన అభిమానులు టీజర్ విషయంలో కాస్త నిరాశకు గురి అయ్యారు.భోళా శంకర్ టీజర్ కు ప్రస్తుతం మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానులు టీజర్ పట్ల పాజిటివ్‌గా స్పందిస్తున్న మరికంత మంది మాత్రం చిరంజీవి మూవీ అంటే పెద్ద ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేశాము…ఇందులో కొత్త ఏముంది అని విమర్శిస్తున్నారు.

comments on this point in bholaa shankar teaser

టీజర్ లో కొత్తగా ఏమి లేదు…ప్రతి సీన్ ఇంతకుముందు ఎక్కడో చూసినట్లుగానే అనిపిస్తుంది…డైలాగ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసినంత డిఫరెంట్ గా లేవు…మామూలు మాస్ సినిమా లాగే ఉంది కానీ బాస్ సినిమా లాగా లేదు. మరి ముఖ్యంగా వచ్చిరాని తెలంగాణ స్లాంగ్‌లో విచిత్రంగా చిరంజీవి పలికిన డైలాగ్స్ ప్రస్తుతం ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాయి.

comments on this point in bholaa shankar teaser

తమ అభిమాన నటుడు అలాంటి డైలాగ్స్ చెప్పడం జీర్ణించుకోలేని అభిమానులు ఆ డైలాగ్స్ పై రకరకాల మీమ్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నిజానికి చిరంజీవి డైలాగ్ చెబుతూ ఉంటే థియేటర్ మొత్తం విజిల్స్ తో మారు మోగుతుంది …అలాంటి చిరంజీవి సాగదీసినట్లు డైలాగులు పలుకుతుంటే వినడానికి విచిత్రంగా ఉంది.

comments on this point in bholaa shankar teaser

చిరుకి సెట్ అయ్యే విధంగా మామూలు స్లాంగ్‌లో డైలాగ్ రాస్తే మరింత బాగుండేది అని అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన వాల్తేర్ వీరయ్యలో చిరు డైలాగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి.. ఇప్పుడు ఈ మూవీలో కూడా అదే రేంజ్ ఎక్స్పెక్ట్ చేసిన ప్రేక్షకులు మొదట టీజర్ తో నిరాశకు గురి అయ్యారు. మరి ఈ నేపథ్యంలో చిత్రంపై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందో అన్నది ఆలోచించాల్సిన విషయం.

ALSO READ : “మెగాస్టార్ చిరంజీవి” కెరీర్‌లో టాప్ హిట్ అయిన ఈ 15 సినిమాలు… “రీమేక్స్” అని తెలుసా..?

You may also like