ఈ 3 హీరోయిన్స్ మధ్య ఉన్న ఈ “కామన్ పాయింట్” గమనించారా..?

ఈ 3 హీరోయిన్స్ మధ్య ఉన్న ఈ “కామన్ పాయింట్” గమనించారా..?

by Mohana Priya

Ads

నాగార్జున హీరోగా వచ్చిన “సోగ్గాడే చిన్ని నాయనా” సినిమా ఓ రేంజ్ లో హిట్ అయింది. అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని… ఇటు మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉంటుంది అని అప్పుడే ప్రకటించారు. అప్పటినుంచి సీక్వెల్ ఎలా ఉండబోతోందా? అని అందరిలోనూ ఉత్సుకత నెలకొంది.

Video Advertisement

ఈ సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు విడుదలకి సిద్ధమయ్యాయి. కానీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని సినిమాలు వెనకడుగు వేశాయి. బంగార్రాజు మాత్రం మొదటి నుండి సంక్రాంతి బరిలోనే ఉంది. ఈ సినిమా బృందం చెప్పినట్టుగానే బంగార్రాజు హిట్ అయింది. ఇందులో నాగ చైతన్య పక్కన క్రితి శెట్టి హీరోయిన్‌గా నటించారు.

12 anupama

ఇటీవల క్రితి హీరోయిన్‌గా నటించిన ఉప్పెన, శ్యామ్ సింగ రాయ్ కూడా హిట్ అయ్యాయి. ఇప్పుడు బంగార్రాజుతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టారు క్రితి శెట్టి. క్రితిలాగానే అంతకుముందు కూడా ఇద్దరు హీరోయిన్స్ ఇలాగే హ్యాట్రిక్ హిట్స్ కొట్టారు. వారే అనుపమ పరమేశ్వరన్, సమంత. అనుపమ అ ఆ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఈ సినిమా హిట్ సాధించింది. తర్వాత వచ్చిన ప్రేమమ్, శతమానం భవతి సినిమాలు కూడా హిట్ అయ్యాయి.

అలాగే ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమంత కూడా, తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో బృందావనం, మహేష్ బాబుతో దూకుడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ సాధించారు. ఇప్పుడు ఈ జాబితాలో క్రితి శెట్టి కూడా చేరారు. ప్రస్తుతం క్రితి సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నితిన్ తో మాచర్ల నియోజకవర్గం, రామ్ పోతినేనితో ద వారియర్ తో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. ఇంకా కొన్ని సినిమాలు డిస్కషన్ దశలో ఉన్నాయి.


End of Article

You may also like