Home Filmy Adda సాయి పల్లవి నటించిన ఈ రెండు సినిమాల్లో… ఈ కామన్ పాయింట్ గమనించారా.?

సాయి పల్లవి నటించిన ఈ రెండు సినిమాల్లో… ఈ కామన్ పాయింట్ గమనించారా.?

by Mohana Priya

నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమా థియేటర్లలో విడుదలై సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో సాయి పల్లవి, క్రితి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటించారు. రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

పునర్జన్మల నేపధ్యంలో ఈ సినిమా నడుస్తుంది.  డైరెక్టర్ అవుదాం అనుకునే వాసు అనే ఒక వ్యక్తి, తనకి తెలియకుండా శ్యామ్ సింగ రాయ్ అనే ఒక వ్యక్తి గురించి కథలు రాస్తాడు. అసలు అతను ఎవరు? అతని కథలు వాసు ఎందుకు రాసాడు? శ్యామ్ సింగ రాయ్ కి, వాసుకి ఉన్న సంబంధం ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా అంతా తిరుగుతుంది.

common point between two sai pallavi movies

సినిమా చూసిన ప్రేక్షకులు, నానితో పాటు సాయి పల్లవి నటనని కూడా మెచ్చుకుంటున్నారు. రోజీ పాత్రలో సాయి పల్లవి చాలా బాగా నటించారు అని అంటున్నారు. అయితే, ఇందులో ఒక సీన్ లో సాయి పల్లవి డ్యాన్స్ చేస్తున్నప్పుడు నాని దణ్ణం పెడతారు. ఈ సీన్ చాలా బాగుంది అని ప్రేక్షకులు అన్నారు. ఇలాంటి సీన్ అంతకుముందు సాయి పల్లవి నటించిన ఇంకొక సినిమాలో ఉంది.

common point between two sai pallavi movies

సాయి పల్లవి హీరోయిన్‌గా, శర్వానంద్ హీరోగా నటించిన పడి పడి లేచే మనసులో కూడా ఇలాంటి సీన్ ఉంది. ఒక పాటలో సాయి పల్లవి డ్యాన్స్ చేస్తుంటారు.  అక్కడే నుంచొని డాన్స్ చూస్తున్న శర్వానంద్ సాయి పల్లవికి దణ్ణం పెడతారు. అలా అనుకోకుండా ఈ రెండు సినిమాల్లో ఈ సీన్ కామన్ పాయింట్ అయింది.

You may also like