పెళ్లిలో ఈ పెళ్లి కొడుకుకి అమ్మాయి తరపు వాళ్ళు పెట్టిన కండిషన్స్ చూశారా..? ఏం ఉన్నాయంటే..?

పెళ్లిలో ఈ పెళ్లి కొడుకుకి అమ్మాయి తరపు వాళ్ళు పెట్టిన కండిషన్స్ చూశారా..? ఏం ఉన్నాయంటే..?

by kavitha

Ads

ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకునే చాలా మంది జంటలు తమ వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్ కాంట్రాక్ట్ పై సంతకం చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటివి సాధారణంగా వధువు లేదా వరుడి స్నేహితులే చేయిస్తూ ఉంటారని చెప్పవచ్చు. గతఏడాది తమిళనాడు వధువుతో వరుడి ఫ్రెండ్స్ తమ ఫ్రెండ్ ని వారితో క్రికెట్ ఆడనివ్వాలని కాంట్రాక్ట్ పై సంతకం  చేయించుకున్నారు. ఈ వార్త వైరల్ గా మారింది.

Video Advertisement

అలాంటి ఇన్సిడెంట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వధువు స్నేహితులు పెళ్ళికి ముందు వరుడితో ఆ ప్రీ వెడ్డింగ్ కాంట్రాక్ట్ పై సైన్ చేయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.పెళ్లి అనేది జీవితంలో ముఖ్యమైన వేడుక. ఎన్నో కలలతో కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ అమ్మాయి మెట్టింట్లో అడుగు పెడుతుంది. సాధారణంగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు చాలా జాగ్రత్తలు చెప్తుంటారు. ఇక పెళ్ళిలో మగపెళ్ళి వారు కండిషన్లు పెడుతుంటారు. కానీ తాజాగా జరిగిన పెళ్ళిలో పెళ్లి కూతురి ఫ్రెండ్స్ వరుడికి కండిషన్లు పెట్టారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. Wedding-planవైరల్ వీడియోలో పెళ్లి చేసుకోబోయే జంట పెళ్లి మండపంలోకి వెళ్తుండగా, మండపంలోకి వెళ్ళకుండా పెళ్లి కూతురి ఫ్రెండ్స్ కాంట్రాక్ట్ పేపర్ ను పట్టుకుని ఉన్నారు. దానిపై సైన్ చేస్తే తప్ప మండపంలోకి వెళ్లనివ్వమని చెప్పడంతో పెళ్ళికుమారుడు ఆ అగ్రిమెంట్ పై సంతకం చేశాడు. ఆ తరువాత వధూవరులు వివాహం జరిగింది. ఈ వీడియోను వధువు కాజల్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. వరుడు సంతకం చేసిన కాంట్రాక్ట్ లో ఏముందంటే, కాజల్‌ను ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి.  ఆమెను షరతులు లేకుండా ప్రేమించాలి. ఆమె ఎల్లప్పుడు సకరెక్ట్ గానే చేస్తుందని ఒప్పుకోవాలి. ఏడాదికి  3 సార్లు ఆమెను టూర్‌కు తీసుకెళ్లాలి. ఆమె ఆనందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ, ఎప్పుడూ ఆమె చలిగా ఫీల్ అవకుండా చూడాలి అని ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.

https://www.instagram.com/reel/CtMRr_0AWnq/?utm_source=ig_embed&ig_rid=701767e6-2117-48ae-a3af-148b0ba32a8b

Also Read: మరి విడ్డూరం కాకపోతే..! ఇలాంటి కారణంతో కూడా జాబ్ ఇవ్వరా..?


End of Article

You may also like