Ads
భారతదేశ అపర కుబేరుడు ముఖేష్ అంబానీ పెళ్లి వేడుకలు ఒక రేంజ్ లో జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రపంచ అతిరథ మహారధులు అందరూ ఆ వేడుకలలో పాల్గొన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే, అక్కడ అనంత్ అంబానీ తన ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటే ఎమోషనల్ అయిన ముకేశ్ అంబానీ గురించి కూడా అందరికీ తెలిసిందే అయితే ఎవరికీ తెలియని ఒక విషయం ఏమిటంటే ముకేశ్ అంబానీ ఆహ్వానించిన ప్రతి అతిధికి ఆంక్షలు విధించారంట. అయితే అంబానీ పెట్టిన ఆంక్షలు, అక్కడ అతిధులు పడిన ఆగచాట్లు ఏమిటో చూద్దాం.
Video Advertisement
అతిధులు ఒక బ్యాగ్ ఒక హ్యాండ్ బ్యాగ్ మాత్రమే తీసుకురావాలని కండిషన్ పెట్టారట. ప్రతి ఈవెంట్ డ్రెస్ కోడ్ ఆధారంగా దుస్తులు ప్లాన్ చేసుకోవాలని ముందుగానే సూచించారు. అతిధులు మార్గదర్శకాలని పాటించాలని, ఈవెంట్ కి వచ్చిన వెంటనే ఎవరిని సంప్రదించాలి? ఎక్కడ ఉండాలి? ఆహార అవసరాలు, వైద్య అవసరాలు ఉన్నప్పుడు ఏ ఆతిథ్య బృందాన్ని సంప్రదించాలి అని ముందుగానే అతిధులకి సూచించారంట.
ముంబై ఢిల్లీ నుంచి వచ్చే అతిధుల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. అప్పుడు అంబానీ పెట్టిన కండిషన్ ఏమిటంటే ఒక అతిధి ఒక లగేజ్ ని మాత్రమే తీసుకురావాలని, ఎక్కువగా లగేజీ తీసుకువస్తే విమానంలో ఆ లగేజ్ జాంనగర్ వరకు చేరుకుంటుందని హామీ ఇవ్వలేమని చెప్పారంట. అలాగే సెలబ్రిటీల కోసం హోటల్లో క్లాత్ స్టీమర్ ఉంది అయితే దానిని ఉపయోగించాలంటే కనీసం మూడు గంటలు వేచి ఉండాల్సి వస్తుందట.
వచ్చిన అతిధులకి హెయిర్ స్టైల్, మేకప్ కి సంబంధించిన సేవలు అందుబాటులో ఉంచారు కానీ ఎవరికి అవసరం వచ్చినప్పుడు వారు చేయించుకునే అవకాశం లేదు. ఒక క్యూ పద్ధతి ప్రకారం ఫస్ట్ కం,ఫస్ట్ సర్వ్ పద్ధతిలో సాగుతుందంట. అంబానీ పెళ్లి ఇంట ఆహ్వానం అందుకోవటం అదృష్టం అని భావించిన సెలబ్రిటీలు ఇప్పుడు ఈ ఆంక్షలు అన్ని భరించాల్సి రావటం కొద్దిగా ఇబ్బందే మరి.
End of Article