వైరల్ అవుతున్న “కండక్టర్ ఝాన్సీ” పాత డాన్స్ వీడియో..!

వైరల్ అవుతున్న “కండక్టర్ ఝాన్సీ” పాత డాన్స్ వీడియో..!

by Mohana Priya

Ads

రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన టెలివిజన్ కామెడీ షోలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. అయితే ఈ షో ఒక్క తాజా ప్రోమో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే చాలామంది దృష్టిని ఆకట్టుకుంది. ప్రోమో రిలీజ్ అయి 24 గంటలు గడవకముందే ఇప్పటికే ఇది 7 లాక్స్ వ్యూస్ ను దాటింది.ఈ ప్రోమో ని చూసిన నటిజన్లు కండక్టర్ డాన్స్ కు ఫిదా అయి ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ ఎపిసోడ్ ఆగస్టు 28 ఆదివారం 2022 మధ్యాహ్నం ఒంటి గంటకి ఈటీవీ ఛానల్ లో ప్రీమియర్ చేయబడింది

Video Advertisement

శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ గా వచ్చిన ఈ ఎపిసోడ్ ఇతివృత్తం కప్పల పెళ్లి. ఇందులో ఆటో రాంప్రసాద్ ,హైపర్ ఆది,చలాకీ చంటి, రాకెట్ రాఘవ ,తాగుబోతు రమేష్ తమ ట్రేడ్ మార్క్ పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించారు.

jhansi

అంతేకాదండోయ్ ఈ షోకు శ్రీకాకుళం జానపద పాటలు ఈసారి మంచి హైప్ ని తెచ్చాయి. ఇందులో ప్రత్యేకంగా ఆర్టీసీ కండక్టర్ అయిన ఝాన్సీ ప్రస్తుతం ట్రెండింగ్ గా ఉన్న పల్సర్ బైక్ పాటకు వేసిన డాన్స్ ఈ షోకే హై లైట్.ఝాన్సీ మాస్ స్టెప్స్ కి కమెడియన్స్ అందరూ ఉర్రూతలూగుతూ ఎంజాయ్ చేశారు. ఇక రష్మి గౌతమ్ మరియు ఆమని అయితే……ఝాన్సీ తో కలిసి స్టేజ్ ని ఒక ఊపు ఊపారు.. అయితే ఝాన్సీ డాన్స్ చేసిన పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఝాన్సీ సీతయ్య సినిమాలోని ఒక పాట కి డాన్స్ వేశారు. ప్రస్తుతం ఆ పాట వైరల్ అవుతోంది. అది చూసిన వారు అందరూ కూడా ఝాన్సీ డాన్స్ ని అభినందిస్తున్నారు.

watch video :


End of Article

You may also like