Ads
కొన్ని వందల సంవత్సరాలు అవుతున్నా సరే ప్రేమకు చిహ్నంగా తాజ్ మహల్ ని ఇంకా భావిస్తారు. ప్రేమకు చిహ్నంగా ప్రేమికులు దీనిని గుర్తిస్తారు. షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం తాజ్ మహల్ ని కట్టడం వెనక ఎన్నో కథలు ఉన్నాయి. అయితే అది నిజమో కాదో తెలియదు కానీ ఎప్పటికీ తాజ్ మహల్ ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది.
Video Advertisement
అయితే ఆ తరహాలోనే ఒక జ్ఞాపకాన్ని నిర్మించుకున్నాడు మధ్యప్రదేశ్ కి చెందిన వ్యక్తి. వివరాల్లోకి వెళితే… మధ్య ప్రదేశ్ లోని బుర్హాన్ పూర్ లో అచ్చం తాజ్ మహల్ లాంటి ఒక కట్టడాన్ని కట్టించి స్థానికులని ఆశ్చర్యపరిచాడు. షాజహాన్ భార్య ముంతాజ్ బుర్హాన్ పూర్ లో మరణించిందని చరిత్ర అంటోంది.
కానీ ఆగ్రాలో తాజ్ మహల్ కట్టించాడు షాజహాన్. అయితే బుర్హాన్ పూర్ లో తాజ్ మహల్ లాంటి నిర్మాణాన్ని చేయాలని అనుకున్నాడు ఈ వ్యక్తి. అచ్చం తాజ్ మహల్ మాదిరి లాగే మూడేళ్లపాటు కృషి చేసి ఈ కట్టడాన్ని నిర్మించడం జరిగింది. చూడడానికి అచ్చం తాజ్ మహల్ లాగా ఉండేటట్టు తయారు చేయించాడు.
End of Article