Home Filmy Adda “సుచి లీక్స్” తో పాటు… ధనుష్ ఇరుక్కున్న 4 కాంట్రవర్సీలు..!

“సుచి లీక్స్” తో పాటు… ధనుష్ ఇరుక్కున్న 4 కాంట్రవర్సీలు..!

by Mohana Priya

తమిళ్ స్టార్ హీరో ధనుష్, ధనుష్ భార్య ఐశ్వర్య సోషల్ మీడియా వేదికగా వారి విడిపోతున్నట్లు ప్రకటించారు. ఐశ్వర్య సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు. 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు వారిద్దరూ విడిపోదామని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ వార్త చాలా మంది అభిమానులు షాక్ అయ్యేలా చేసింది. మామూలుగా వీరిద్దరికీ బెస్ట్ కపుల్ అని పేరు ఉంది.

అంతకుముందు ఐశ్వర్య కోసం ధనుష్ పాట పాడిన వీడియో కూడా చాలా వైరల్ అయ్యింది. అంత బాగా ఉన్నవాళ్లు సడన్ గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటూ చాలా మంది కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. ధనుష్ అంతకు ముందు కూడా కొన్ని కాంట్రవర్సీల్లో ఇరుక్కున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

dhanush

#1 త్రీ సినిమా షూటింగ్ సమయంలో ధనుష్, శృతి హాసన్ రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమాకి డైరెక్టర్ ఐశ్వర్య ధనుష్. కానీ వారిద్దరి మధ్య అలాంటిది ఏమీ లేదు అని అన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమా తర్వాత మళ్లీ ధనుష్, శృతి హాసన్ కలిసి ఇంకొక సినిమాలో నటించలేదు. అలాగే ఈ సినిమాలో ఉన్న కొన్ని సీన్స్ పై కూడా అప్పుడు ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

controversies faced by dhanush

#2 సింగర్ సుచిత్ర కార్తీక్, తమిళ్ ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది ప్రముఖులకి సంబంధించిన ప్రైవేట్ ఫొటోస్ కొన్ని లీక్ చేశారు. అందులో ధనుష్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి. ఆ ఫోటోలో ధనుష్ తో పాటు అనిరుధ్ కూడా ఉన్నారు.

controversies faced by dhanush

#3 ధనుష్ తల్లిదండ్రులు తామే అంటూ ఒక ఇద్దరు కోర్టులో కేసు వేశారు. ఈ విషయంపై చాలా రోజులు చర్చలు జరిగాయి. ధనుష్ తల్లిదండ్రులు తామే అని, ధనుష్ ని కస్తూరి రాజా దంపతులు పెంచుకున్నారు అని, ధనుష్ కస్తూరి రాజాకి సొంత కొడుకు కాదు అని చెప్పారు.

controversies faced by dhanush

#4 అలాగే నటి అమలా పాల్, తన భర్త విజయ్ తో విడాకులు తీసుకున్నారు. ధనుష్, అమలా పాల్ కలిసి రఘువరన్ బీటెక్ సినిమాలో నటించారు. ఆ తర్వాత అమలా పాల్, విజయ్ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. దాంతో అమలా పాల్ విడాకులు తీసుకోవడం వెనక ధనుష్ ప్రమేయం ఉంది అని, అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ధనుష్ అని కొంత మంది అంటుంటారు.

controversies faced by dhanush

వీటిలో ఎంత వరకు నిజం ఉందో, ఎంత వరకు కల్పితమో తెలియదు. కానీ ధనుష్ పై మాత్రం ఇలా కొన్ని పుకార్లు వచ్చాయి.

You may also like