Home Filmy Adda “చై-సామ్” డివోర్స్ తో పాటు… 2021లో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచిన 7 కాంట్రవర్సీలు..!

“చై-సామ్” డివోర్స్ తో పాటు… 2021లో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచిన 7 కాంట్రవర్సీలు..!

by Mohana Priya

చూస్తుండగానే 2021 అయిపోయింది. ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే చాలా సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా విషయాలు ఈ సంవత్సరం జరిగాయి.

అందులో కొన్ని విషయాలు అయితే చాలా మంది సినిమా అభిమానులు షాక్ కి గురయ్యేలా ఉన్నాయి. అలా 2021 లో సినిమా ఇండస్ట్రీలో జరిగిన వివాదాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

#1 నాగ చైతన్య – సమంత

టాలీవుడ్ లో స్టార్ కపుల్స్ లో ఒకరిగా చెప్పుకునే నాగ చైతన్య సమంత ఈ సంవత్సరం విడాకులు ప్రకటించారు. అసలు ఉన్నట్టుండి ఇలాంటి వార్త ప్రకటించడంపై అభిమానులు అందరూ షాక్ కి గురయ్యారు.

#2 వకీల్ సాబ్

ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో తన ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. సినిమా విడుదలైనప్పుడు కొన్ని రాజకీయ విషయాల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ విషయంలో గొడవ అయింది.

Controversies in 2021 in Tollywood

#3 సాయి ధరమ్ తేజ్

ఒక రోజు సాయి ధరమ్ తేజ్ రోడ్డుమీద వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. బైక్ స్కిడ్ అయ్యి సాయి ధరమ్ తేజ్ కింద పడ్డారు. గాయాలకు చికిత్స పొందిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం కోలుకున్నారు.

sai dharam tej 2

#4 పవన్ కళ్యాణ్ స్పీచ్

రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ అప్పుడు వైరల్ అయ్యింది.

Controversies in 2021 in Tollywood

#5 మా ఎలక్షన్స్

మా ఎలక్షన్ సమయంలో మంచు విష్ణు ప్రకాష్ రాజ్, అలాగే మిగిలిన సభ్యులకి మధ్య జరిగిన వివాదాలు చర్చనీయాంశంగా మారాయి.

Controversies in 2021 in Tollywood

#6 పోసాని కృష్ణ మురళి

పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణ మురళి చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా నిలిచాయి.

Controversies in 2021 in Tollywood

#7 నాని

ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరల విషయంపై నాని మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై సిద్ధార్థ్, నిఖిల్, దిల్ రాజు వంటి కొంత మంది సినీ ప్రముఖులు మాట్లాడారు.

Controversies in 2021 in Tollywood

ఈ సంవత్సరం టాలీవుడ్ లో జరిగిన కొన్ని వివాదాలు ఇవే.

You may also like