మునుగోడు నీదా?.. నాదా..? మునుగోడు ఉపఎన్నిక.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఇదే హార్ట్ టాపిక్. టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ ఇలా ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నాయి. ముఖ్యంగా టిఆర్ఎస్, బిజెపి పార్టీలు తమ పూర్తిస్థాయి శక్తిని వినియోగిస్తున్నాయి. గెలుపు నీదా, నాదా అనే విధంగా పార్టీలు తలపడుతున్నాయి. రోజుకో రకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో మునుగోడు ఫలితం ఎలా ఉండబోతుందోనని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Video Advertisement

 

copact సంస్థ విశ్లేషణ ప్రకారం మునుగోడు మూడ్..!!

గతంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కచ్చితమైన విశ్లేషణలు అందించిన copact సంస్థ మునుగోడు ప్రజల మనోగతాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా ఈనెల 22 నుంచి 29వ తేదీ వరకు మునుగోడు నియోజకవర్గం లోని ఏడు మండలాలలో దాదాపు 3,000 మంది సాధారణ ఓటర్లతో ఈ సంస్థ ప్రతినిధులు మమేకమై వారి మనోభావాలు తెలుసుకొనే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మునుగోడు ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు అని తేల్చే క్రమంలో చాలా ఆసక్తికర విషయాలులు వెళ్లడయ్యాయి.

Munugode voters Survey

Munugode voters Survey

7 మండలాలలో పార్టీల బలా బలాలు పరిశీలిస్తే..!!

1) మునుగోడు.
మొత్తం ఓటర్ల సంఖ్య – 36,000
మునుగోడు నియోజకవర్గ కేంద్రం అయినందున అన్ని పార్టీల చూపు దీనిపై ఎక్కువగా ఉంటుంది. మునుగోడు ఉప ఎన్నికల నగరా మోగినప్పుడే బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు ఇక్కడ బహిరంగ సభలు పెట్టాయి. ఈ మండలంలో టిఆర్ఎస్ వర్సెస్ బిజెపిగా రోజురోజుకీ రాజకీయ పరిణామం మారుతుంది. ఈ మండలంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉండడం వల్ల రాజగోపాల్ రెడ్డికి లాభం చేకూరే అవకాశం ఉంది. ఇక ఇక్కడ అధికార పార్టీ భారీ ఎత్తున ఎమ్మెల్యేలను దించి అధికార దుర్వినియోగం చేస్తుందనే విమర్శలు పదేపదే వినిపిస్తున్నాయి. దీంతో టిఆర్ఎస్ పై కొంత వ్యతిరేకత కనబడుతోంది. అలాగే రాజగోపాల్ రెడ్డి తన స్వార్థం కోసం పార్టీ మారారని ప్రచారం ఉన్నప్పటికీ వారి కుటుంబానికి అభిమానులు ఉండడం బిజెపి అభ్యర్థికి ఊరటనిస్తుంది. అలాగే టిఆర్ఎస్ పార్టీకి రేపటి సీఎం కేసీఆర్ సభ వల్ల కొంత ప్రయోజనం జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నా మునుగోడు ఓటర్లు మాత్రం తమదైన శైలిలోనే ఓటు వేసే ఒక సాంప్రదాయం మొదటి నుంచి ఇక్కడ ఉంది.

Munugode voters Survey

Munugode voters Survey

2) మర్రిగూడ.
మొత్తం ఓటర్ల సంఖ్య 27,800
ఈ మండలంలో కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. కాంగ్రెస్, టిఆర్ఎస్ ముందు నుంచి ఇక్కడ బలంగానే ఉన్నప్పటికీ.. ఈ రెండు పార్టీలు యువత టార్గెట్ గా పనిచేస్తున్నప్పటికీ అధికార పార్టీ నుంచి ప్రలోభాలకు గురి చేస్తున్నారనే విమర్శలు ఇక్కడ వినిపిస్తున్నాయి. ఈ మండలంలో కాంగ్రెస్ కంటే టిఆర్ఎస్ 5% ముందంజలోనే ఉందని చెప్పొచ్చు. కానీ చివరకు పరిస్థితులు తారుమారైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ మండలంలోని శివన్న గూడెం, చర్లగూడెం గ్రామస్తులు ప్రాజెక్టులో భూములని కోల్పోయిన వాళ్లు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం ప్రభుత్వం భూ నిర్వాసితులకు వారి అకౌంట్లో డబ్బులు వేసి ఫ్రీజ్ చేసి ఉంచింది. అవి అన్ ఫ్రీజ్ కాకపోతే ఇక్కడ టిఆర్ఎస్ కి మైనస్ కావచ్చని చెబుతున్నారు.

3) చండూరు.
ఈ మున్సిపాలిటీలోని మొత్తం ఓటర్ల సంఖ్య – 9,950
రూరల్ ఓటర్ల సంఖ్య – 19,500
ఈ మునిసిపాలిటీలో యూత్ ఎక్కువ ఉన్న కారణంగా వీరందరూ 75% బిజెపి వైపు ఉన్నారు. ఈ మండలంలో టిఆర్ఎస్, బిజెపి మధ్య పోటా పోటీగానే ఉంది. ఈ మండలంలో డబ్బు పంపిణీ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు ఎవరికి ఓటు వేయాలో ముందే స్పష్టంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మండలంలో బీఎస్పీ కి కూడా కొన్ని ఓట్లు పడే ఛాన్స్ కూడా ఉంది. కాంగ్రెస్, బిజెపి ఓట్లు చీల్చుకోవడానికి టీఆర్ఎస్ శ్రమిస్తున్నప్పటికీ.. ఓటర్లు బిజెపి వైపే కాస్త మొగ్గు చూపిస్తున్నట్లు ఈ సర్వేలో వెళ్లడైంది.

4) చౌటుప్పల్.
ఏ మున్సిపాలిటీలో మొత్తం ఓటర్ల సంఖ్య – 25,493.
రూరల్ ఓట్ల సంఖ్య – 37,500
మునుగోడు నియోజకవర్గంలోని మొత్తంలో అత్యధిక ఓటర్లు ఈ మండలంలోనే ఉంటారు. అందువల్ల ప్రధాన పార్టీలన్నీ ఈ మండలం పైనే ఎక్కువగా ఫోకస్ చేశాయి. ఈ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో రోజురోజుకీ రాజకీయ పరిణామం మారుతుంది. బిజెపి, టిఆర్ఎస్ పార్టీలో ఈ ఓట్లపైనే ప్రధానంగా ఆశలు పెట్టుకున్నాయి. అలాగే ఈ మండలంలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకీ పడిపోతూ ఉండడం చూస్తే రాహుల్ జూడో యాత్ర ప్రభావం మునుగోడు నియోజకవర్గం పై ఏమాత్రం లేదని చెప్పవచ్చు. ఈ మండలం హైదరాబాద్ కు ఆనుకొని ఉన్నప్పటికీ.. ఇటీవల ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, ఆడియో లీక్ ల ప్రభావం కూడా ఇక్కడ ఏమాత్రం లేదు. ఇక టిఆర్ఎస్ పార్టీ బయటనుంచి ఎమ్మెల్యేలను భారీగా మోహరించడంతో లోకల్ క్యాడర్ కుభారీగా మోహరించడంతో లోకల్ క్యాడర్ కు నాన్ లోకల్ మధ్య గ్యాప్ పెంచినట్లు భావిస్తున్నారు. అలాగే ఈ మునిసిపాలిటీలో భారీగా పోలీసులను మోహరించడంతో ఒక భయాందోళన వాతావరణం నెలకొంది. ఇవే పరిస్థితిలో కొనసాగితే చౌటుప్పల్ మండలంలో బిజెపి కాస్త లాభపడే పరిస్థితి కనిపిస్తుంది. మిగతా మండలాలతో పోలిస్తే ఇక్కడ డబ్బు, మద్యం ప్రభావం తక్కువే.

5) గట్టుప్పల్.
ఈ మండలంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 16,282
ఈ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ఇదే అతి చిన్నది. ఇక రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం గట్టుప్పల్ ని మండలం గా ప్రకటించారు. గతంలో ఇక్కడి ప్రజలు గట్టుప్పల్ ని మండలం చేయాలని ధర్నాలు చేసినప్పటికీ రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం చేసినందున కొంతమంది బిజెపికి అనుకూలంగా ఉంటే.. మండలంగా ప్రకటించిన టిఆర్ఎస్ కి మరికొంత మంది అనుకూలంగా ఉన్నారు. దీంతో ఇక్కడ బిజెపికి 50% ఓట్లు వస్తే, టిఆర్ఎస్ కి 45%, ఇతరులకు 5% వచ్చే అవకాశం ఉంది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇన్చార్జిలుగా ఇక్కడ మఖాం వేయడంతో ఓటర్లు సైలెంట్ గా ఓటింగ్ లో తమ మనోభావాలను వ్యక్తపరిచే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ మండలంలో కాంగ్రెస్ నాయకత్వం సరిగ్గా లేనందున ఆ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యేలా ఉంది. ఇక్కడ ప్రజల మాటలను బట్టి చూస్తే డబ్బు ప్రభావం ప్రధానంగా పనిచేయనున్నట్టు సమాచారం.

6) సంస్థాన్ నారాయణపురం.
మొత్తం ఓటర్ల సంఖ్య – 36,069
ఈ మండలంలో తండాలు ఎక్కువగా ఉన్న కారణంగా టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో డబ్బు ప్రభావం కీలకంగా మారనుంది. అందువల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంకు బిజెపికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ మండలంలో మాజీ ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్ ప్రభావం బాగానే ఉండడం వల్ల టిఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిది కూడా ఇదే మండలం కావడంతో ఈ మండలంలోని ఓట్లను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలాగే ఈ మండలంలో రాజగోపాల్ రెడ్డికి వ్యక్తిగత అభిమానులు ఉండడంతో ఇక్కడ సైలెంట్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉంది. ఇక ఈ మండలంలోని గుడిమల్కాపూర్ లో 26 మందికి దళిత బంధు రావడంతో పాటు వివిధ పథకాలు గ్రామాలలో అమలు కావడంతో టిఆర్ఎస్ కి కలిసి వచ్చేలా ఉంది. అలాగే ఈ మండలంలో ఇంటింటికి చికెన్ బంద్ పథకం బాగానే అమల్లో ఉంది. ఇక కాంగ్రెస్ ఓటు బ్యాంకు పైనే బిజెపి ఆశలు పెట్టుకుంది. అదే జరిగితే ఇక్కడ బిజెపి నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది.

7) నాంపల్లి.
మొత్తం ఓటర్ల సంఖ్య 35,000
ఈ మండలంలో ఎస్టీ లంబాడీలు ఎక్కువగా ఉంటారు. ఈ తండాలలో కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ త్రిముఖ పోరు ఉంటుంది. అయితే మునుగోడు నియోజకవర్గంలో కాస్త వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది నాంపల్లి అనే చెప్పాలి. అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేనందున టిఆర్ఎస్పై కాస్త వ్యతిరేకత ఉన్నా.. పథకాల ప్రభావం కూడా ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ ఓటు ఓటు బ్యాంకు ని ఎవరు చీల్చుకుంటారనేది ఎవరు చీల్చుకుంటారనేది ప్రధాన అంశం. అయితే ఇక్కడ కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ ఓట్లు వస్తే అది టిఆర్ఎస్ కే లాభం చేకూరుస్తుంది.

అయితే మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ ఎలాగైతే ఎమ్మెల్యేలు, మంత్రులను మోహరించిందో బిజెపి కూడా చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి భారీ స్థాయిలో బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలను ప్రచారంలోకి దించింది. బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో పాటు ఆశించిన సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు బిజెపిలోకి రాకపోవడం ఒక ఇబ్బంది అయితే.. బిజెపిలో చేరిన కాంగ్రెస్ వారికి ఇప్పటికే ఉన్న పాత బీజేపీ కార్యకర్తలకు మధ్య గ్యాప్ అలాగే ఉండడంతో ఇది బిజెపికి మైనస్ గా మారింది. కొన్నిచోట్ల రాజగోపాల్ రెడ్డి వచ్చి వెళ్ళాక ఆయన కోసం చేతి గుర్తుకే ఓటు వేయాలని మాట కూడా వినపడడం బిజెపికి ఆందోళన కలిగించే అంశం. అంటే ఇప్పటికీ రాజగోపాల్ రెడ్డి ని జనం కమలంతో కలిపి చూడడం లేదు. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బిజెపి విఫలమైందనే చెప్పాలి. ఇక చివరి 48 గంటలలో రాజగోపాల్ రెడ్డి ని ఢీకొనే సత్తా టిఆర్ఎస్ కి ఉండకపోవచ్చు అని కూడా స్థానికుల బలమైన నమ్మకం. స్థానికుల మాటలను బట్టి చూస్తే రాజగోపాల్ రెడ్డి పై చాలా ఎక్కువగానే ఆశలు కనిపిస్తున్నాయి.

ఇక మొత్తం మునుగోడు నియోజకవర్గం ఓటర్ల సంఖ్య – 2,43,594. మొత్తంగా చూస్తే తాజా పరిస్థితి ప్రకారం టిఆర్ఎస్ పార్టీకి 41%, బిజెపి 36%, కాంగ్రెస్ 14%, ఇతరులు 9% ఓట్లు రాబట్టుకోవచ్చని తెలుస్తోంది.