మునుగోడు..మునుగోడు.. మునుగోడు..సోషల్ మీడియాలో కానీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా గత కొన్ని రోజులుగా మునుగోడు పేరే వినిపించింది. దేశవ్యాప్తంగా మునుగోడు ఎన్నికపై ఓ చర్చ జరిగిందని చెప్పవచ్చు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎన్నిక పొలిటికల్ హీట్ పెంచేసింది.. ఇంతటి ఉత్కంఠ పోరులో టిఆర్ఎస్ తన సత్తాను చాటింది.. కేవలం మూడు రౌండ్లలో ఆధిపత్యం కొనసాగించిన బిజెపి ఆ తర్వాత టిఆర్ఎస్ ముందు నిలబడలేకపోయింది..!

Video Advertisement

అలాంటి మునుగోడు ఉప ఎన్నికపై అనేక సర్వేలు వారి వారి అంచనాలను ఇచ్చాయి.. కానీ ఫలితాన్ని 95% ఖచ్చితంగా చెప్పిన సర్వే సంస్థ “COPACT” మాత్రమే.. మునుగోడు లో జనాలు ఏమనుకుంటున్నారు.? గెలుపు తీరానికి వెళ్లేది ఎవరు.? ప్రజల ఆలోచన విధానం ఏ విధంగా ఉంది.? ఏ ఏ అంశాలు ఓటింగ్ సరళిని ప్రభావితం చేయనున్నాయి..? అనే ప్రశ్నలతో అక్కడి ప్రజల మనోగతాన్ని 95% తెలుసుకునే ప్రయత్నం చేసింది COPACT సర్వే సంస్థ. ఇప్పటికే మునుగోడులో రెండుసార్లు లోతుగా సర్వే నిర్వహించింది ఈ సంస్థ.. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలలో మేజర్ గ్రామాలలో 3000 మంది నుంచి సమాచారాన్ని సేకరించింది.

పోలింగ్ 15 రోజులు ఉన్న సమయంలో ఒక సర్వే,పోలింగ్ నాలుగు రోజులు ఉన్న టైం లో మరో సర్వే నిర్వహించింది COPACT సంస్థ. తెరాస పార్టీకి 41% ఓట్లు వస్తాయని, బిజెపికి 36% వస్తాయని ముందే వెల్లడించింది. సంస్థ చెప్పినట్లుగానే టిఆర్ఎస్ పార్టీకి 42 శాతం ఓట్లు వచ్చాయి.. సంస్థ నిర్ధారించినట్లుగానే తెరాస పార్టీ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ప్రధాన ప్రత్యర్థి అయిన బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై విజయ ఢంకా మోగించారు. అయితే మండలాల వారిగా ఏ మండలంలో ఏ కారణాలవల్ల ఏ ఏ పార్టీకి లాభనష్టాలు ఉంటాయో కూడా COPACT ముందుగానే అంచనా వేసింది. 95 శాతం సర్వే వెల్లడించిన విధంగానే ఆయా మండలాల వారీగా ఫలితాలు కూడా వచ్చాయి. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న “COPACT” రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన సేవలను అందిస్తోంది. 2020 జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఒక ప్రధాన పార్టీ తరఫున కీలక పాత్ర పోషించింది. అప్పుడు కూడా మంచి ఫలితాలను అందుకుంది. తాజాగా మునుగోడు ఉప ఎన్నికల్లో “COPACT” బృందాల శాస్త్రీయ పరిశోధన ప్రకారం తెరాసకు పది నుంచి 12 వేల మెజారిటీ వస్తుందని చెప్పగా.. తుది ఫలితం కూడా ఆ విధంగానే వచ్చింది.. దీంతో “COPACT” చేసిన సర్వే నిజమైంది.