హైదరాబాద్ లో ఎక్కువ కరోనా కేసులు ఉండడానికి కారణం ఇదేనా..?

హైదరాబాద్ లో ఎక్కువ కరోనా కేసులు ఉండడానికి కారణం ఇదేనా..?

by Megha Varna

Ads

ప్రజలు, ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న హైదరాబాద్ లో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకీ రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి.వాటి సంఖ్యను చూస్తుంటే ప్రజలలో ఆందోళన ఎక్కువ అవుతుంది.తెలంగాణలో నమోదయ్యే కేసులలో దాదాపు 80 శాతం కేసులు హైదరాబాద్ నుండి వస్తున్నాయి.దీనితో హైదరాబాద్ వాసులలో ఆందోళన ఎక్కువవుతుంది.అసలు హైదరాబాద్ లో కరోనా మహమ్మారి ఎక్కడలేనంత తీవ్రంగా విజృంభించాడానికి కారణమేంటి అనే ప్రశ్నకు పరిశోధకులు ఏమంటున్నారో తెలుసా?

Video Advertisement

నగరవాసులలో 100 కి 70 మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని చాలా సర్వేలలో తేలింది.సూర్యరశ్మి తగలకుండా ఇళ్ళకి ఆఫీసులకు పరిమితమైన నగరవాసులలో ఈ విటమిన్ డి లోపం ఎక్కువగా కనిపిస్తుంది.సాధారణంగా శరీరంలోకి ఏదైనా వైరస్‌ వచ్చినప్పుడు సైటోకీన్స్ అనేవి వైరస్‌ల పై దాడిచేసి వాటిని నాశనం చేస్తాయి.కానీ విటమిన్‌ డి లోపం ఉన్నవారిలో ఈ సైటోకీన్సే ఇతర వైరస్ ను ఎదుర్కునే రక్త కణాల పై ఎదురు దాడి చేస్తాయి. దీనివల్ల శరీరంలోని ప్రధాన అవయవాలు విఫలమవుతాయి. ఇలా జరగకుండా సైటోకీన్స్‌ సక్రమంగా పనిచేయాలంటే విటమిన్‌ -డి ఎంతో అవసరం.

ఈ విటమిన్‌ -డి ను పెంచుకోవడం కోసం రోజు ఉదయం ఎండలో అరగంట నిలబడండి.ఇలా చేయడం ద్వారా సహజంగా విటమిన్‌ -డి అనేది శరీరంలో పెరుగుతుంది. అలాగే విటమిన్‌ -డి పుష్కలంగా ఉన్న చేపలు,గుడ్లు,వెన్న,పాల లాంటి పదార్ధాలను ఎక్కువగా తీసుకోవాలి.ఒక వేళ అవసరమైతే డాక్టర్ లను సంప్రదించి విటమిన్ డి టాబ్లెట్స్ ను వాడితే శరీరానికి అవసరమైన విటమిన్ డి లభిస్తుంది.


End of Article

You may also like