“అమ్మ చేతి కషాయం…కరోనా కతం అంతే..” ట్రెండ్ అవుతున్న టాప్ 10 తెలుగు మీమ్స్.! చూసి నవ్వుకోండి!

“అమ్మ చేతి కషాయం…కరోనా కతం అంతే..” ట్రెండ్ అవుతున్న టాప్ 10 తెలుగు మీమ్స్.! చూసి నవ్వుకోండి!

by Mohana Priya

Ads

డాక్టర్లు హాస్పటల్ లోనే కాదు చాలా మంది ఇళ్లలో ఉంటారు. చాలామంది కాదు దాదాపు అందరి ఇళ్లలో ఉంటారు. వాళ్లే అమ్మలు. మీకు జలుబు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకవేళ వెళ్ళినా కూడా డాక్టర్ ఇచ్చే మందుల కి జలుబు తగ్గడానికి ఒక మూడు నాలుగు రోజులు పడుతుంది. అదే ఇంటికి వచ్చి మీకు జలుబు చేసిందని మీ అమ్మతో చెప్పండి. కేవలం ఒకే ఒక గ్లాసు కషాయం. అంతే. జలుబు తగ్గడం కాదు అసలు ఇంక మీ జోలికి రాదు. ఆ కషాయంలో అంత పవర్ ఉంటుంది.కరోనా కోసం మందు కొనుక్కోవడానికి డాక్టర్లు అందరూ తెగ కష్టపడుతున్నారు. కానీ ఒకసారి ఆలోచించండి. అసలు కరోనా రావడానికి సూచనలు ఏంటి? దగ్గు, తుమ్ములు, జలుబు. మామూలుగా మనం కషాయం తాగేది కూడా వాటికే. మరి అలాంటప్పుడు దగ్గు, జలుబు అనిపించినప్పుడు కషాయం తాగితే సరిపోదా? ఇదే ఐడియా చాలా మంది కి వచ్చి ఇళ్లల్లో ఉపయోగిస్తున్నారు.

Video Advertisement

మనకి కొంచెం జలుబు చేస్తేనే ఒక గ్లాసుడు కాషాయం తాగుతాం. గ్లాస్ ఏ కదా అనుకోకండి. అందులో కషాయం ఉంటే గ్లాస్ కూడా బిందె లాగా అనిపిస్తుంది. కషాయం తాగడం అంత కష్టం మరి. ఇప్పుడు కరోనా సమయం కాబట్టి వంట గది ఫార్మాస్యూటికల్ ల్యాబ్ అయిపోయింది.ఈసారి ఒక్కరోజు తో సరి పెట్టుకోవడానికి లేదు. వైరస్ వీడ్కోలు పలికే అంత వరకు రోజు మనం బిందెడు కాదు కాదు గ్లాస్ కషాయం తాగాల్సిందే.ఈ కరోనా కషాయం మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ ని సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో చూపిస్తున్నారు. వాటిలో కొన్ని మీమ్స్ ఇవే.

#1 కాఫీ = కషాయం

#2 కషాయం దెబ్బ!  కరోనా అబ్బా!

#3 అంటే.. అది.. మరి.. 

#4 మాకు కూడా.

#5 నెక్స్ట్ నుంచి సోషల్ మీడియా (బ్యాడ్) ఇన్ఫ్లుయెన్సర్స్ లిస్టులో ఈ మెసేజ్ లు పంపించిన వాళ్ళని కూడా కలపాలి.

#6 ఇప్పుడు కరోనా కాబట్టి ఎక్కడికి పోలేవు. 

#7 హ్మ్మ్!

#8 మూడు కాదు 30 పూటలు అయినా తాగాల్సిందే

#9 మాటల్లేవ్!

#10 తాగగా తాగగా కషాయం తియ్యగా ఉండు!

 


End of Article

You may also like