Ads
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ విజృంభిస్తుంది. దీనితో జనాలు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన వారు తమ ఇళ్ళ పక్కన ఉంటే వెంటనే…వాళ్ళు ఇంటి నుండి భయంతో బయటకు రావడం మానేస్తున్నారు.కొంతమందైతే ఆ ప్రాంతాల నుండి వేరే చోటుకి మకాం మార్చేస్తున్నారు.
Video Advertisement
ఇలాంటి టైంలో తాజాగా పరిశోధకులు ఓ స్టడీని బయటపడుతున్నారు.ఇందులో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వాళ్ళ కుటుంబాలలో దాదాపు 10 నుంచి 15 శాతం మందికి మాత్రమే కరోనా సోకుతుంది.మిగతావారికి ఈ వైరస్ ప్రబలట్లేదని నిర్ధారణ అయింది.దీనికి కారణం ఏంటనే దాని పై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి.
ప్రస్తుతానికి పరిశోధకులు వేసిన అంచనా ప్రకారం ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్న కుటుంబ సభ్యులకు ఈ కరోనా ప్రబలట్లేదు. ఒకవేళ ప్రబలిన అది వారి ఇమ్యూనిటీ లెవెల్స్ దాటికి నిలువలేక మెడికల్ అసిస్టెన్స్ తో పనిలేకుండా నయమవుతుంది.లేదా తక్కువ హానికరం అయిన కరోనా వైరస్ ప్రబలి ఉంటుంది అని అంచనాలకు వచ్చినట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గాంధీ నగర్ డైరెక్టర్ దిలీప్ ఆదివారం తను ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు.
End of Article