చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా సోకిన ఆటగాడు ఎవరో తెలుసా?

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా సోకిన ఆటగాడు ఎవరో తెలుసా?

by Mohana Priya

Ads

ఐపీఎల్ 20 20 లో చెన్నై సూపర్ కింగ్స్ టీం తరపున ఆడుతున్న ఒక క్రికెటర్ కి కరోనా పాజిటివ్ వచ్చింది అని ఇప్పటికే అందరికీ తెలిసే ఉంటుంది. శుక్రవారం వరకు కూడా ఏ క్రికెటర్ కి పాజిటివ్ వచ్చింది అని అధికారికంగా ఎటువంటి ప్రకటనా లేదు.

Video Advertisement

కానీ టీమ్ ఇండియా తరపున ఆడిన రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ అని హింట్ ఇచ్చారు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో ఆడుతున్న రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్లు ఇద్దరే. ఒకరు దీపక్ చాహర్, ఇంకొకరు శార్ధూల్ ఠాకూర్. దాంతో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి పాజిటివ్ వచ్చింది అని ప్రజలు అంచనా వేయడం మొదలు పెట్టారు.

సమయం కథనం ప్రకారం కరోనా పాజిటివ్ వచ్చిన ఆ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ అనే విషయం శనివారం బయటికి వచ్చింది. ఐపీఎల్ 20 20 కోసం యూఏఈ కి వెళ్లే ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ చెన్నైలో ఒక క్యాంప్ ఏర్పాటు చేసింది.

ఫ్రాంచైజీ ఆ క్యాంప్ లోకి మహేంద్ర సింగ్ ధోని, సురేష్ రైనా, కర్ణ్ శర్మ, దీపక్ చాహర్‌ తో పాటు మరికొంతమంది కీలకమైన ప్లేయర్స్ ని ఛార్టర్డ్ ఫ్లైట్ లో తరలించింది. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి ఈ క్యాంప్ వల్ల భయం పట్టుకుంది.

టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు ఉన్నాయి. కానీ వాళ్లలో చెన్నై ఫ్రాంచైజీ మాత్రమే తమ క్యాంప్ ని భారత్ లో ఏర్పాటు చేసింది. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తప్ప మిగిలిన అన్ని జట్లు యూఏఈ లో నిర్వహించిన కరోనా టెస్ట్ లో పాసయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులతో పాటు కొంతమంది స్టాఫ్ సభ్యులకి కూడా కరోనా పాజిటివ్ రావడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) లో ఆందోళన నెలకొంది.

 


End of Article

You may also like