కరోనా సాంగ్స్ | కరోనా మీద వచ్చిన టాప్ తెలుగు సాంగ్స్

కరోనా సాంగ్స్ | కరోనా మీద వచ్చిన టాప్ తెలుగు సాంగ్స్

by Megha Varna

కరోనా సమస్య పై ప్రజల్లో చైతన్యవంతం చేయడానికి కొందరు ప‌లువురు ప్ర‌ముఖులతో పాటు సామాన్య ప్రజలువినూత్న మార్గాల‌ని ఎంచుకుంటున్నారు.వీడియోల ద్వారా తమ సందేశాలు పంపుతున్నారు , యూట్యూబ్ లో కరోనా మీద వచ్చిన పాటలు అన్ని అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుత తరుణంలో ఇంటికే పరిమితమవుతున్న లక్షలాది మంది ప్రజలకు కాలక్షేపం కల్పించేందుకు, హాస్యంతో వారి భయాందోళనలకు కాసేపైనా దూరం చేసేందుకు సోషల్‌ మీడియా కళాకారులు తమదైన శైలిలో కృషి చేస్తున్నారు.యూట్యూబ్ లో టాప్ ట్రేండింగ్ లో ఉన్న కరోనా సాంగ్స్ మీకోసం.

Video Advertisement

corona telugu songs

corona telugu songs

1) క‌రోనిపై జ‌నాల‌లో మ‌రింత అవ‌గాహ‌న క‌లిపించేందుకు చౌర‌స్తా బ్యాండ్ క‌రోనాపై ప్ర‌త్యేక సాంగ్స్ రూపొందించింది. వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించేలా ‘చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా’ అంటూ ఈ బృందం పాడిన పాట సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.

2.) ఇండస్ట్రీకి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్స్ తమదైన స్టైల్ లో పాటలు పడుతూ అవగాహనా కల్పిస్తున్నారు.  ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారు కరోనా ఓ పాటను విడుదల చేశారు. ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నం.1 సినిమాలోని ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పాటను పేరడీ చేసి కరోనాపై ఆయన కొత్త పాటను విడుదల చేశారు.ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి.. ఇక్కడే చేరింది మహమ్మారి రోగ మొక్కటి పేరడి పాట ప్రస్తుతం ఈ పాట నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

3) సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‍ గారు కూడా కరోనాపై మీద ఓ పాట పాడుతూ కరోనాకు అర్థాన్ని వివరించారు, క అంటే కలిసి మెలసి తిరగకండి. రో అంటే రోడ్లమీద నడవకండి, నా అంటే నాలుగు వారాలపాటు ఇంట్లో ఉండందని చెబుతూ ఆయన పాడిన పాట అందరినీ ఆకట్టుకుంటోంది.

4) కరోనా మహమ్మారిపై రఘు కుంచె గారు పాడిన పాట సోషల్ మీడియా లో ట్రెండ్ సెట్ చేసింది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత చూపిన కొందరు ఇష్టం వచ్చినట్లు మూతికి మాస్కులు లేకుండా రోడ్లపైకి వచ్చి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఇలాంటి వారి కోసం “చెప్పిన మాట వినకుంటే ఓరి నాయనా..సంకనాకి పోతావురా ఓరి నాయనా..నువ్వు సంకనాకి పోతావురా ఓరి నాయనా.. మహమ్మారి వచ్చింది ఓరి నాయనా.. వంగబెట్టి మింగుతాంది ఓరి నాయనా.. మనల్ని వంగబెట్టి మింగుతాంది ఓరి నాయనా..’’ రఘు కుంచె మంచి పాటను పాడి విడుదల చేసారు

5) సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కూడా కరోనా మీద స్వయంగా తన స్టైల్లో పాట రాసి,పాడారు.‘‘అది ఒక పురుగు. కనిపించని పురుగు. కరోనా అనే పురుగు. నలిపేద్దామంటే అంత సైజు లేదు దానికి. పచ్చడి చేద్దామంటే అంత కండ లేదు దానికి. అదే దాని బలం. అదే దాని దమ్ము’’అంటూ రామ్‌ గోపాల్‌ వర్మ పాడిన పాట యూట్యూబ్ లో ట్రెండింగ్‌ ఉంది.

6) కరోనాపై చిరు, నాగ్‌, తేజూ, వరుణ్ తేజ్ కలిసి కోటి సారథ్యంలో పాట ఆలపించగా, వందేమాతరం శ్రీనివాస్ కూడా తనదైన స్టైల్‌లో ఓ పాట రూపొందించారు. ఈ పాటను చూసిన మోడీ.. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేలా పాట రూపంలో చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయిథరమ్ తేజ్ మంచి మెసేజ్ ఇచ్చారని మోడీ ధన్యవాదాలు తెలుపుతూ తెలుగులో ట్వీట్ చేశారు.

7) ఎక్కడిదీ కరోనా.. ఏమిటి ఈ కరోనా.. కంటికి కనిపించని పెను శత్రువు ఈ కరోనా…అంటు రోగమై సోకే మృత్యువు.. ఈ కరోనా..దీనివల్ల మనముందే.. యుగాంతమే జరిగేనా…మనం చేయు తప్పులకు.. మరో రూపు కరోనా..మనుషుల నిర్లక్షానికి.. మరో పేరు కరోనా…..అంటూ ఎస్.పి .బాల సుబ్రహ్మణ్యం గారు తన దైన శైలిలో కరోనా పై పాట పాడినారు,

8) కరోనా మీద ప‌లువురు ప్ర‌ముఖులతో పాటు సామాన్య ప్రజలు కూడా క‌రోనాపై ప్ర‌త్యేక  పాటలు పొందించారు, మాయదారి కరోనా..మహమ్మారి కరోనా అంటూ ఈ చిన్నారి పాట మీరు కూడా వినండి.

9) ఎక్కడిది ఈ పాడు రోగము మనుషులను వణికిస్తున్న కరోనా స్పెషల్ సాంగ్.

10) కరోనా మీద చాలా పాటలు వచ్చాయి ,కానీ అందరి కన్నా ముందు కరోనా మీద మొదటి సాంగ్ పాట పాడింది ఈ టీం కి చెందుతుంది.చాలా బాగా పాడినారు,మీరు కూడా ఒక్కసారి వినండి

https://youtu.be/aeBgHktQE-A

11) కరోనా పై మానసా ఆచార్య స్పెషల్ సాంగ్…. కరోనా …ఓ కరోనా మాపై ఎంత ఘోర దాడి చేశావూ..ప్రపంచాన్ని కలవరపరుస్తున్న కరోనా వైరస్‌పై సింగర్ మానస ఆచార్య పాట పాడారు.

12) కరోనా వైరస్ నేపథ్యంతో రూపొందించిన పేరడీ సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. … నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నా కరోనా పేరడీ సాంగ్స్ ..కరోనా పై  జొన్నవిత్తుల పేరడీ సాంగ్

13) అల వైకుంఠాపురం’లోని సామజవరగమన అనే పాటకు ఇది వరకే చాలా మంది తమదైన రీతిలో పారడీలు కట్టగా తాజాగా కరోనాపై “- ‘సామజవరగమనా.. నేనిల్లు దాటగలనా!‘ ఈ పేరడీ సాంగ్  వైరల్‌ అవుతోంది.

14) మహేష్ బాబు సినిమాలోని మైండ్ బ్లాక్ సాంగ్ ను కూడా కరోనా పేరడి సాంగ్ గా మార్చేశారు. కరోనా వైరస్‌పై రూపొందించిన ‘మైండ్ బ్లాక్’ పేరడీ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

https://youtu.be/-YiF9734cqg

15) మన వాళ్ళు కరోనా వైరస్ ని కూడా వదలకుండా డీజే సాంగ్ ఎడిట్ చేసారు,  చేయి చేయి కలపకురా.. రమనా మాస్కు వేసుకోవాలిరా!

 

View this post on Instagram

 

audio remix matram . . #trolls #memes #insta_entertainmnt @insta__entertainmnt

A post shared by INSTA_ENTERTAINMNT (@insta__entertainmnt) on

16) రఘువరన్ బిటెక్ సినిమా లోని హ్యాండ్ లో  గ్లాస్ పాటకు కరోనాపేరడీ సాంగ్


You may also like

Leave a Comment