Ads
భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్.హీరో నాగార్జున ” మాస్ “చిత్రంతో దర్శకుడిగా మారి” స్టైల్” ,”కాంచన” లాంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు రాఘవ లారెన్స్.రాఘవ లారెన్స్ కు ఎంత సామాజిక బాధ్యత ఉందొ పేద,వికలాంగులు ,అందుల మీద ఎంత కరుణ ఉన్నాయనే విషయాలు రాఘవ లారెన్స్ చిత్రాలు చుస్తే అర్ధం అవుతుంది.అయితే ఎప్పటినుండో రాఘవ లారెన్స్ పేదల కోసం ఒక స్వచ్చంధ సంస్థను నడుపుతున్నారు.అయితే తాజాగా ఆ ట్రస్ట్ లో ఉంటున్న వారికి 20 మందికి పైగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది విరాల్లోకి వెళ్తే..
Video Advertisement
చెన్నైలోని అశోక్ నగర్ లో రాఘవ లారెన్స్ ఎప్పటినుండో ఒక స్వచ్చంద సంస్థ నడుపుతున్నారు.అందులో నివాసం ఉంటున్నవారికి కరోనా లక్షణాలు కనపడడంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమై కరోనా పరీక్షలు నిర్వహించడంతో 20 మందికి పైగా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో అందరూ షాక్ కి గురయ్యారు.దీంతో వీరందరిని క్వారంటైన్ కు తరలించి ఎమర్జెన్సీ వార్డ్ లో చికిత్స అందిస్తున్నారు.దీనిపై రాఘవ లారెన్స్ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు.ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చిన నేనున్నాను అంటూ ముందుకు వచ్చి సహాయం చేస్తూ ఉంటారు రాఘవ లారెన్స్ .అయితే తాజాగా కరోనా నేపథ్యంలో ప్రధానమంత్రి సహాయనిధికి 3 కోట్ల విరాళాన్ని ఇచ్చారు రాఘవ లారెన్స్.ప్రస్తుతం రాఘవ లారెన్స్ ట్రస్ట్ మొత్తాన్నీ నిర్బంధించి పెద్ద మొత్తంలో కెమికల్స్ స్ప్రే చేస్తున్నారు.
End of Article