“సామ్ జామ్”షో కోసం “సమంత” స్పెషల్ డ్రెస్ ధర ఎంతో తెలుసా.? ప్రత్యేకత ఏంటి.?

“సామ్ జామ్”షో కోసం “సమంత” స్పెషల్ డ్రెస్ ధర ఎంతో తెలుసా.? ప్రత్యేకత ఏంటి.?

by Mohana Priya

Ads

ఇన్ని సంవత్సరాలు మనల్ని నటిగా అలరించిన సమంత ఇపుడు హోస్ట్ గా ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఇటీవల బిగ్ బాస్ హోస్ట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. కానీ అది కేవలం ఒక్క ఎపిసోడ్ మాత్రమే. ఇపుడు ఆహా యాప్ లో సామ్ జామ్ అనే ప్రోగ్రాం లో సిరీస్ మొత్తం హోస్ట్ చేయబోతున్నారు సమంత.

Video Advertisement

ఈ ప్రోగ్రాంకి సంబంధించిన ఈవెంట్ ఇటీవల జరిగింది. ఆ ఈవెంట్ లో ఆహా అధినేత అల్లు అరవింద్ గారు , దర్శకురాలు నందిని రెడ్డి ఇంకా హోస్ట్ గా వ్యవహరించబితున్న సమంత పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో సమంత లుక్ అందరిని ఆకర్షించింది.

పంకజ్ అండ్ నిధి డిజైన్ చేసిన డ్రెస్ ధరించారు సమంత. ఈ డ్రెస్ రీ సైకిల్ చేసిన ప్రాస్టిక్ బాటిల్స్ నుండి తయారు చేసిన ఫాబ్రిక్ తో రూపొందించారు. లక్మే ఫాషన్ వీక్ లో ఈ కలెక్షన్ ప్రదర్శించారు. ఈ డ్రెస్ ధర 27,000 రూపాయలు. ఈ లుక్ ని ప్రముఖ స్టైలిస్ట్ ప్రీతమ్ జూకాల్కర్ డిజైన్ చేశారు.

ఇంక షో విషయానికి వస్తే ఈ షో లో గెస్ట్స్ గా విజయ్ దేవరకొండ, తమన్నా, రష్మిక మందన్న అలాగే ప్రముఖ సెలబ్రిటీస్ రాబోతున్నారు. కౌన్ బనేగా కరోడ్ పతి , కాఫీ విత్ కరణ్ షోస్ కి పని చేసిన సిబ్బంది సామ్ జామ్ షో కి కూడా పని చేసారు అనే వార్త వినిపిస్తోంది.

 


End of Article

You may also like