బిగ్ బాస్ లో “సమంత” కట్టిన చీర ధర ఎంతో తెలుసా.? ఈ విషయం తెలుస్తే షాక్ అవుతారు.!

బిగ్ బాస్ లో “సమంత” కట్టిన చీర ధర ఎంతో తెలుసా.? ఈ విషయం తెలుస్తే షాక్ అవుతారు.!

by Mohana Priya

కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ లో బిజీ గా ఉండడంతో, అందులోనూ షూటింగ్ అవుట్ డోర్ అవ్వడంతో, గతవారం బిగ్ బాస్ హోస్టింగ్ కి రాలేకపోయారు. వీకెండ్ ఎపిసోడ్స్ లో శనివారం మామూలు ఎపిసోడ్ గానే కంటిన్యూ అవ్వగా, ఆదివారం రోజు మాత్రం సమంత హోస్ట్ బాధ్యతను తీసుకున్నారు.

Video Advertisement

అంతే కాకుండా ఆదివారం పండగ కూడా కావడంతో బిగ్ బాస్ దాదాపు మూడు గంటలు ప్రసారం అయ్యింది. ఇప్పటి వరకు మనల్ని తన నటనతో అలరించిన సమంత, బిగ్ బాస్ షో ద్వారా హోస్ట్ గా కూడా ఎంటర్టైన్ చేశారు. కంటెస్టెంట్స్ గురించి చెప్పి అలాగే కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు సమంత.

సమంత హోస్టింగ్ ఎలా ఉంది అనే విషయం పై సోషల్ మీడియాలో ఒక పోల్ నిర్వహించగా, 74 శాతం నెటిజన్లు బాగుంది అని వోట్ చేశారు.  ఆలా సమంత తనలో ఉన్న మరొక టాలెంట్ కూడా చూపించారు. బిగ్ బాస్ ఎపిసోడ్ లో సమంత లుక్ అందరినీ ఆకర్షించింది.

source : khitijjalori.com

ముఖ్యంగా సమంత కట్టుకున్న చీర గురించి అయితే చాలా మంది మాట్లాడుకుంటున్నారు. క్షితిజ్ జలోరి అనే డిజైనర్ డిజైన్ చేసిన చీరను సమంత కట్టుకున్నారు. ఈ చీర ధర 44,800 రూపాయలు. క్షితిజ్ జలోరి ఈ చీరను డిజైన్ చేయగా, ప్రముఖ స్టైలిస్ట్ పల్లవి సింగ్ సమంత లుక్ ని స్టైల్ చేశారు.


You may also like