కరోనా వైరస్ గొంతులో ఎన్ని రోజులు ఉంటుంది? లంగ్స్ లో చేరటానికి ముందు ఏం చేస్తుంది?

కరోనా వైరస్ గొంతులో ఎన్ని రోజులు ఉంటుంది? లంగ్స్ లో చేరటానికి ముందు ఏం చేస్తుంది?

by Mohana Priya

Ads

ఇప్పుడున్న పరిస్థితుల్లో దగ్గు, తుమ్ము వచ్చినా కూడా కరోనా ఏమో అని భయపడుతున్నారు జనాలు. దుమ్ము కి లేదా వాతావరణం మారినప్పుడు జలుబు చేయడం లాంటివి సహజం. కానీ ఆ విషయాన్ని మర్చిపోయి దగ్గినా తుమ్మినా వైరస్సే కారణం అని ఆందోళనకు గురవుతున్నారు. నిజానికి ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తి కరోనా వైరస్ సోకినప్పుడు వైరస్ ముందు గొంతులోకి చేరుతుందట.

Video Advertisement

మనం నీళ్లు ఎక్కువగా తాగకపోవడం వల్ల గొంతులో మ్యూకస్ అనేది ఏర్పడుతుంది అట. జలుబు చేసినప్పుడు ముక్కులో నుండి వచ్చే చీమిడి లాంటిదే మ్యూకస్. వైరస్ సోకినప్పుడు మ్యూకస్ గొంతులో దాదాపు 24 నుండి 48 గంటల పాటు ఉంటుందట. కాబట్టి గొంతులో ఏమైనా అడ్డుకుంటున్నట్టు అనిపిస్తే 10 నుండి 12 గ్లాసుల వరకు మంచినీళ్లు తాగాలట.

అలా ఎక్కువ మోతాదులో నీళ్లు తాగినప్పుడు మ్యూకస్ గొంతులో నుండి కడుపులోకి వెళ్తుందట. దాంతో విరోచనాలు అవుతాయట. అప్పుడు మ్యూకస్ కూడా బయటికి వెళ్లి పోతుంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలట. ఒకవేళ వాతావరణ మార్పుల వల్ల దగ్గు కానీ జలుబు కానీ జ్వరం కానీ వస్తే ఆందోళన చెందకుండా ఒకవేళ జ్వరం 100 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే పల్స్ రేట్, ఆక్సిజన్ శాచ్యురేషన్ చెక్ చేయాలట.

ఒకవేళ ఆక్సిజన్ శాచ్యురేషన్ 93 శాతం కంటే తక్కువ ఉంటే అప్పుడు టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉందట. ఫుల్ బాడీ స్కాన్,డీ డైమర్,ఎల్ డి హెచ్, సి ఆర్ పి టెస్టులలో కూడా ఫలితాల్లో వచ్చిన వాల్యూ సాధారణ వ్యాల్యూ కంటే ఎక్కువగా లేదా తక్కువగా ఉంటే అప్పుడు ఆ అనారోగ్య సమస్య కరోనా అయ్యే అవకాశం ఉందట. 93 శాతం కంటే ఎక్కువ ఉంటే గనక భయపడాల్సిన పని లేదట.

అంతేకాకుండా కరోనా వచ్చి తగ్గిన మనుషుల నుండి కూడా సామాజిక దూరం పాటించటం మంచిదట. ఎందుకంటే వాళ్ల ఇమ్యూన్ సిస్టమ్ బలహీనంగా ఉంటుందట. దాంతో పక్కవారికి కూడా వైరస్ వ్యాపించే అవకాశం ఉందట. ఇది వర్షాకాలం కాబట్టి దగ్గు జలుబు అనేవి ఈ కాలంలో సర్వసాధారమట.

అందుకే అన్నిటికీ ఆందోళన చెందకుండా, దగ్గు వచ్చినంత మాత్రాన కరోనా వచ్చింది అని ఫిక్స్ అయిపోకుండా, టెస్టులు చేయించాక మాత్రమే మీ అనారోగ్య సమస్య ఏంటి అనేది నిర్ధారించుకోవాలి అని డాక్టర్లు చెబుతున్నారు.

 


End of Article

You may also like