Ads
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఇటీవల జరిగిన ఓ ఘటన చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే, ఈనాడు కథనం ప్రకారం గుంటూరు జిల్లా, నాదెండ్ల లోని గణపవరం నివాసులైన పోలిశెట్టి రవి అనే ఒక యువకుడు గుంటూరుకు చెందిన మహమ్మద్ షాహీనా అనే యువతిని ప్రేమించారు. వీరిద్దరూ గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.
Video Advertisement
ఇద్దరు మేజర్లు అవ్వడంతో వారం క్రితం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నాదెండ్ల పోలీసులను ఆశ్రయించి రక్షణ కావాలి అని కోరారు. పోలీసులు ఇరు కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అంతా బాగానే ఉంది అనే సమయంలో రవి కుటుంబ సభ్యులు బుధవారం నాడు నోములు జరుపుకుంటున్నారు.
అదే సమయంలో షాహీనా తరపు బంధువులు వచ్చి రవి ఇంట్లో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇంటి అద్దాలు పగిలిపోయాయి. అంతే కాకుండా ముగ్గురికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గొడవని అదుపు చేశారు.
End of Article