Ads
మామూలుగా సినిమాల్లో హీరో, హీరోయిన్ బైక్ మీద వెళుతూ పాటలు పాడుకోవడం వంటివి మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇటీవల ఒక జంట నిజంగానే బైక్ మీద ఇలాగే స్టంట్స్ చేద్దామని ప్రయత్నించారు. కానీ పరిస్థితి మాత్రం వేరేలా ఎదురయ్యింది.
Video Advertisement
వివరాల్లోకి వెళితే, బీహార్ లోని గయా జిల్లాలో గ్రామీణ రోడ్ల పై ఒక జంట బైక్ మీద తిరిగారు. వాళ్లు బైక్ మీద వెళ్తున్నప్పుడు ఆ వెనకాల కూర్చున్న యువతి డ్రైవ్ చేస్తున్న యువకుడికి ఎదురుకుండా కూర్చొని అతని కౌగిలించుకోవడం వంటివి చేసింది. ఇదంతా జరుగుతున్నా కూడా ఆ యువకుడు వేగంగా బండి నడుపుతూనే ఉన్నాడు.
వీళ్ళ పనులను చూసిన కొంత మంది గ్రామస్తులు ఆటోలో వాళ్లని వెంబడించి వెళ్లి వాళ్ళిద్దర్నీ పట్టుకున్నారు. రోడ్డు మీద అలాంటి పనులు చేయకూడదు అని హెచ్చరించారు. అలా చేయడం వల్ల వాళ్లకి, అలాగే వాళ్ళ ఎదురుగా వచ్చే వారికి ప్రాణాపాయం ఉంటుంది అని అన్నారు. కొందరు వాళ్ళు చేసే పనిని వీడియో తీయడం మొదలుపెట్టారు. దాంతో ఆ జంట వాళ్లకి క్షమాపణ చెప్పి వెళ్లిపోయారు.
End of Article