ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తీరా మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం వెళితే ఊహించని ఘటన.. అసలేం జరిగిందంటే..?

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తీరా మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం వెళితే ఊహించని ఘటన.. అసలేం జరిగిందంటే..?

by Megha Varna

Ads

పెద్దలను కాదనుకుని ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం చాలా మంది చేస్తున్నదే. అలాగే తాజాగా ఒక యువతి యువకుడు సామాజిక వర్గాలు వేరు అయినా ఇష్ట పడ్డారని తల్లిదండ్రులను కాదని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. మ్యారేజ్ సర్టిఫికెట్ తెచ్చుకోవడానికి ఆ జంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లగా…

Video Advertisement

అక్కడకి యువతి తండ్రి వచ్చాడు. అక్కడ ఇద్దరికీ వాదనలు జరిగాయి. సోషల్ మీడియాలో ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… కర్ణాటక హరాళే గ్రామానికి చెందిన మహేంద్ర అనే యువకుడు చిత్ర అనే అమ్మాయని ప్రేమించాడు.

ఆమె కూడా మహేంద్రని ప్రేమించింది. ఇరువురు మనసులు కలవడంతో ఇంట్లో ఒప్పుకోరు అని తెలిసి పెద్దల్ని కాదనుకుని పెళ్లి చేసుకున్నారు. చిత్ర తండ్రి కూతురు ప్రేమను అంగీకరించలేదు. ముందు అతనిని మర్చిపోవాలని కూడా ఆమెను హెచ్చరించాడు. అయితే ఇక ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయరు అని డిసెంబర్ 8న పెళ్లి చేసుకున్నారు.

ఒకరోజు వీళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం వెళ్లగా.. ఆ అమ్మాయి తండ్రి బసవరాజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళాడు. ఆమెని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ తన వెంట తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశాడు. అయితే అక్కడున్న వాళ్లు కూర్చొని మాట్లాడుకోవాలని ఇలా చేయడం మంచి పద్ధతి కాదని చెప్పారు.

అక్కడి నుండి చిత్ర తన భర్తతో పాటు బయటపడింది. ఇది జరిగిన తర్వాత అతను తండ్రి నుంచి ప్రాణహాని ఉందని చిత్ర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనితో పోలీసులు బసవరాజ్ నాయక్ కు సమన్లు జారీ చేశారు. ఒకవేళ ఏమైనా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

 


End of Article

You may also like