దేశ ప్రజలకి ఊరట నిన్న భారీగా తగ్గిన కరోనా కేసులు ! గత 24 గంటలో ఎన్నంటే ?

Video Advertisement

కోవిడ్ మహమ్మారితో సతమతమవుతున్న భారత దేశ ప్రజలకి కాస్త ఊరట. గత కొద్దీ రోజులుగా తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగిన కేసుల నుంచి నిన్న పాజిటివ్ కేసుల్లో తగ్గుదల కనిపించింది. దేశంలో మొన్న‌ 40,134 నమోదవ్వగా సోమవారం నాడు 30,549 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 38,887 మంది కోవిడ్ నుంచి కోలుకుని బయట పడ్డారు.

covid cases yesterday

covid cases yesterday

మొత్తం మీద 3,17,26,507 కేసులు ఇప్పటివరకు భారత దేశం లో నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 422 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,25,195 మంది మొత్తం మీద ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 47,85,44,114 వ్యాక్సిన్ డోసులు ఇప్పటి దాకా వేశారు. నిన్న ఒక్క రోజే సుమారు 61 లక్షల మందికి వ్యాక్సిన్ ని అందించారు.