Ads
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా అతలాకుతలం చేసిందో అందరికీ తెలిసిందే. కరోనా వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కరోనా కారణంగా ఎంతో మంది అనాధలుగా మిగిలారు.
ప్రజలు చాలా ఇబ్బందులు పడేలా చేసింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటూ భయం పుట్టించింది. కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత జనం అందరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కాస్త సద్దుమణిగింది. గత రెండేళ్ల నుంచి ప్రజలందరూ మళ్ళీ యధావిధి జీవనం కొనసాగిస్తున్నారు.
Video Advertisement
అయితే ఇప్పుడు మళ్లీ కరోనా భయం మొదలవుతుందా అంటే అవుననే అంటున్నాయి నిఘావర్గాలు. తాజాగా కేరళ రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు వెలుగు చూశాయి. 24 గంటలు 340 కరోనా కేసులు నమోదవుగా అందులో 230 కేసులు కేరళ రాష్ట్రం నుండి ఉన్నాయి. మొత్తం ఐదు కరోనా మరణాల నమోదుగా కేరళ రాష్ట్రం నుండి మూడు మరణాలు ఉన్నాయి. ఈ గణాంకాలని చూస్తుంటే కరోనా మళ్ళీ విజృబిస్తుందేమో అంటూ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సరికొత్త వేరియంట్ అంటూ వైద్య బృందం చెబుతుంది. ఈ వేరియంట్ కి JN1 అని పేరు పెట్టారు. దీని ప్రభావం ఎంత అలా ఉంటుందో తెలియడం లేదు. ఇది బలంగా ప్రభావం చూపుతోందా లేక ఉండగా ఉండగా బలహీన పడుతుందా తెలియక ప్రజలు భయానికి గురవుతున్నారు.
End of Article