Ads
ప్రస్తుతం రెండవ దశ కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో, ఒక హెల్త్ కేర్ వర్కర్ చెరుకు రసం కోసం ఆగిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే వన్ఇండియా కథనం ప్రకారం మధ్యప్రదేశ్ లోని షాహ్డొల్ జిల్లాలో ఒక హెల్త్ వర్కర్ చెరుకు రసం తాగడం కోసం ఒక చెరకు రసం బండి దగ్గర ఆగారు.
Video Advertisement
ఆ వ్యక్తి పీపీఈ (PPE) కిట్ వేసుకొని ఉన్నారు. ఆ వ్యక్తితో పాటు అంబులెన్స్ లో ఇంకొకరు కూడా ఉన్నారు. వారు అంబులెన్స్ లో ఒక కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్ ని తీసుకువెళ్తున్నారు. అక్కడ ఉన్నవారు ఆ హెల్త్ వర్కర్ ని మాస్క్ ధరించమని చెప్పినా కూడా ఆ వ్యక్తి వినకుండా కేవలం గడ్డం వరకు మాత్రమే మాస్క్ ధరించి ఉన్నారు.
అంతే కాకుండా అక్కడ ఉన్నవారు మాస్క్ సరిగా ధరించాలి అని చెప్తుంటే హెల్త్ వర్కర్ “తనకి కరోనా లేదు అని, కేవలం పేషెంట్ ని మాత్రమే వాళ్ళు తీసుకెళ్తున్నారు అని, తనని చెరుకు రసం తాగనివ్వమని” చెప్పారు. ఆ హెల్త్ కేర్ వర్కర్ కి తనని వీడియో తీస్తున్నారు అనే విషయం అర్ధమయ్యి అప్పుడు మాస్క్ సరిగ్గా ధరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
watch video :
शहडोल में कुछ स्वास्थ्यकर्मी एक #कोरोना संक्रमित को लेकर खुलेआम शहर के बीच घूमते नजर आए, यही नही कोरोना संक्रमित को लेकर शहर के बीच गन्ने के जूस का आनंद लेते रहे @ndtv @ndtvindia #COVID19India pic.twitter.com/Qg07TcR6ei
— Anurag Dwary (@Anurag_Dwary) April 9, 2021
End of Article