కోవిడ్ పేషెంట్ ని తీసుకెళ్తూ… చెరుకు రసం కోసం అంబులెన్స్ ఆపడం ఏంటో.? వైరల్ అవుతున్న వీడియో.!!

కోవిడ్ పేషెంట్ ని తీసుకెళ్తూ… చెరుకు రసం కోసం అంబులెన్స్ ఆపడం ఏంటో.? వైరల్ అవుతున్న వీడియో.!!

by Mohana Priya

Ads

ప్రస్తుతం రెండవ దశ కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో, ఒక హెల్త్ కేర్ వర్కర్ చెరుకు రసం కోసం ఆగిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే వన్ఇండియా కథనం ప్రకారం మధ్యప్రదేశ్ లోని షాహ్డొల్  జిల్లాలో ఒక హెల్త్ వర్కర్ చెరుకు రసం తాగడం కోసం ఒక చెరకు రసం బండి దగ్గర ఆగారు.

Video Advertisement

covid health worker stopped to drink sugar cane juice

ఆ వ్యక్తి పీపీఈ (PPE) కిట్ వేసుకొని ఉన్నారు. ఆ వ్యక్తితో పాటు అంబులెన్స్ లో ఇంకొకరు కూడా ఉన్నారు. వారు అంబులెన్స్ లో ఒక కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్ ని తీసుకువెళ్తున్నారు. అక్కడ ఉన్నవారు ఆ హెల్త్ వర్కర్ ని మాస్క్ ధరించమని చెప్పినా కూడా ఆ వ్యక్తి వినకుండా కేవలం గడ్డం వరకు మాత్రమే మాస్క్ ధరించి ఉన్నారు.

covid health worker stopped to drink sugar cane juice

అంతే కాకుండా అక్కడ ఉన్నవారు మాస్క్ సరిగా ధరించాలి అని చెప్తుంటే హెల్త్ వర్కర్ “తనకి కరోనా లేదు అని, కేవలం పేషెంట్ ని మాత్రమే వాళ్ళు తీసుకెళ్తున్నారు అని, తనని చెరుకు రసం తాగనివ్వమని” చెప్పారు. ఆ హెల్త్ కేర్ వర్కర్ కి తనని వీడియో తీస్తున్నారు అనే విషయం అర్ధమయ్యి అప్పుడు మాస్క్ సరిగ్గా ధరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

watch video :


End of Article

You may also like