Ads
కరోనా రాకతో ప్రపంచమంతా భయపడుతుంది. కాని ఓ జంట దీని వల్లే మేము కలిశాం అందువల్లే ఇప్పుడు ఒక్కటవుతున్నాం అంటున్నారు.అసలు వీళ్ళ కథేంటంటే ప్రకాశం పర్చూరు కి చెందిన అబ్బాయి హైదరాబద్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు.కరోనా తీవ్రత ఎక్కువవ్వడంతో ఇంటికి చేరాడు.అతడికి కరోనా టెస్ట్ లో పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో గుంటూరు లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కోసం చేరాడు.
Video Advertisement
అదే సమయంలో గుంటూరులోని చిలకలూరిపేటకు చెందిన అమ్మాయికి కరోనా పాజిటివ్ రావడంతో ఆమెకు ఆ అబ్బాయి పక్కన బెడ్ ఇచ్చారు. ఈ టైంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా ఆ స్నేహం ప్రేమగా మారడానికి పెద్ద టైం పట్టలేదు. ఇద్దరూ ఒకే రోజూ కరోనా నుండి కోలుకొని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు.ఇద్దరు తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పారు. ఒకే సామాజిక వర్గం కావడంతో గొడవలు ఏం జరగకుండా రెండు వైపుల పెద్దలు ఓకే అనేశారు.దీనితో ఈ నెల 25 న పొన్నూరు లోని ఓ దేవాలయంలో ఈ జంట ఒక్కటయ్యారు.ఈ వ్యవహారం వారం,పదిరోజుల్లో జరగడం విశేషం.ఇప్పుడు ఈ కథ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.అన్నిటి మీద తమ క్రియేటివిటీని ఉపయోగించే మీమర్స్ దీని మీద కూడా తమ క్రియేటివిటీని ఫుల్ గా వాడారు.కావాలంటే వాటిని మీరే చూడండి.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
End of Article