పుష్ప సినిమాకి ఇండియన్ క్రికెటర్ ట్వీట్…నీ అవ్వ తగ్గేదేలే అంటూ..!!

పుష్ప సినిమాకి ఇండియన్ క్రికెటర్ ట్వీట్…నీ అవ్వ తగ్గేదేలే అంటూ..!!

by Megha Varna

Ads

పుష్ప సినిమా అల్లు అర్జున్ కి మంచి హిట్ ని తీసుకు వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపించారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. అల వైకుంఠపురంలో తరవాత మంచి బ్లాక్ బస్టర్ బన్నీకి ఈ సినిమా తీసుకు వచ్చింది. అలానే దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప.

Video Advertisement

డిసెంబర్ 17 న ఈ చిత్రం విడుదల అయ్యింది. అద్భుతమైన కలెక్షన్లతో పాటు ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది పుష్ప సినిమా. సెలబ్రిటీలు కూడా ఎంతో అందిస్తున్నారు. తాజాగా ఒక ఇండియన్ క్రికెటర్ నుంచి పుష్ప సినిమాకి ప్రశంసలు వచ్చాయి. మరి ఇక దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే.. తాజాగా ఇండియన్ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా పుష్ప సినిమాని చూశానని అన్నారు.

అలానే ఈ సినిమా పై ఊహించని కామెంట్స్ చేశారు ప్రజ్ఞాన్ ఓజా. ట్విట్టర్ వేదికగా ఈ మూవీను చూసినట్లు తెలిపారు. అలానే సినిమాకి సంబంధించి తన అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకున్నారు. నిజంగా యాక్టింగ్ నాకెంతో నచ్చింది. ఒకప్పుడు ‘పుష్ప.. ఏడవడం నాకు అస్సలు నచ్చదు’ అనే డైలాగ్ పాపులర్ అయ్యింది. ఇప్పుడు ‘పుష్ప పుష్పరాజ్ నీ అవ్వ తగ్గేదేలే’ డైలాగ్ బ్లాక్ బస్టర్  అంటూ ప్రజ్ఞాన్ ఓజా ట్వీట్ చేశారు.

ఇది చూసిన బన్నీ థాంక్స్ ప్రజ్ఞాన్ ఓజా గారు అంటూ రిప్లై ఇచ్చారు. పుష్ప సినిమాలో మనం బన్నీ వన్ మ్యాన్ షో తో అలరించడం చూసాము. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, రష్మిక యాక్టింగ్ ఎంతో బాగా ఆకట్టుకున్నాయి. అలానే సమంతా స్పెషల్ సాంగ్ కూడా పాపులర్ అయిపోయింది. ఓవర్ ఆల్ గా అద్భుతంగా అలరించింది పుష్ప సినిమా.

 

 

 


End of Article

You may also like