Home Filmy Adda అప్పుడు “రామ్ చరణ్” గురించి అలా అని.. ఇప్పుడేమో..? వైరల్ అవుతున్న ట్వీట్..!

అప్పుడు “రామ్ చరణ్” గురించి అలా అని.. ఇప్పుడేమో..? వైరల్ అవుతున్న ట్వీట్..!

by Mohana Priya

ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?

వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. ఇందులో రామ్ చరణ్ నటనకి చాలా ప్రశంసలు వస్తున్నాయి. అన్ని షేడ్స్ ఉన్న పాత్రలో రామ్ చరణ్ బాగా చేశారు అని అంటున్నారు. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ కి అంత మంచి పాత్ర పడింది.

critic tweet about ram charan goes viral

అల్లూరి సీతారామరాజు గా ఒక పోలీస్ పాత్రలో, అలాగే ఒక యోధుడిగా ఇలా కొన్ని షేడ్స్ ఉన్న పాత్రలో రామ్ చరణ్ నటించారు. ఇలాంటి పాత్రలో రామ్ చరణ్ నటించడం ఇదే మొదటి సారి. అయితే రామ్ చరణ్ నటనకి సంబంధించిన ఒక ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. రామ్ చరణ్ హీరోగా నటించిన జంజీర్ సినిమా తెలుగులో తుఫాన్ పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాకి చాలా నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ నటన గురించి ఒక క్రిటిక్, “ఖాకీ లో ఉన్న ఒక వుడ్ ఫేస్ హీరో” అని రాశారు.

critic tweet about ram charan goes viral

అంటే ఎక్స్ప్రెషన్స్ పలకలేదు అని అర్థం. కానీ ఇప్పుడు రామ్ చరణ్ నటన ని అదే క్రిటిక్ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఇప్పుడు “రామ్ చరణ్ మొత్తం భారతదేశాన్ని కూడా తన నటనతో తుఫాన్ వచ్చేలా చేశారు” అని ట్వీట్ చేశారు. దాంతో “అప్పుడు అలా అన్న వారే ఇప్పుడు ఇలా అంటున్నారు. రామ్ చరణ్ నిజంగానే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మంచి నటుల్లో ఒకరు” అని నెటిజన్లు అంటున్నారు.

You may also like