ప్రపంచం అంత రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ తో ముందుకు దూసుకుపోతుంది . కాగా ఈ ప్రపంచంలో ఎన్నో రకరకాల జంతువూలు పక్షులు ఉన్నాయి .వాటిలో కొన్ని జాతులకు సంబందించినవి అతి అరుదుగా ఉండగా కొన్ని పక్షులు సెల్ ఫోన్ రేడియేషన్స్ వాళ్ళ చనిపోతున్న విషయం మనకు తెలిసిందే.ఈ ప్రపంచంలో మనషుల కంటే కూడా మూగజీవాలని ప్రేమించే ఎనిమల్ లవర్స్ చాలామందే వున్నారు .

Video Advertisement

వారు తమకంటే ఎక్కువగా మూగజీవాలపై వారి ప్రేమను చూపిస్తూ కుటుంబ సభ్యుల కంటే కూడా ఎక్కువగా చూసుకుంటారు .కాగా కొన్నిసార్లు మూగ పక్షుల మరణం ప్రతి ఒక్కరిని కలిచి వేస్తుంది .అసలు ఎందుకు పక్షులు చనిపోతున్నాయి అసలు దానికి కారణం ఏంటి అని ఆలోచించగా సెల్ రేడియేషన్స్ అని కొంతమంది చెప్పగా అసలు వాటికీ ఇంకా ఏమి కారణాలు  ఉన్నాయ్  అనే అనుమానం కలగక మానదు ..

ఈ నేపథ్యంలో కూడా సరిగ్గా ఎలాంటి అనుమానమే కలుగుతుంది …తాజాగా తమిళనాడులోని పానపాక్కం దగ్గరలో ఎక్కువగా కాకులు చనిపోవడం గమనించిన స్థానికులు ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అసలు కాకులు ఎందుకు చనిపోతున్నాయి అనే విషయాన్నీ  తెలుసుకొనేందుకు అధికారులు రంగంలోకి దిగారు ..

పూర్తి వివరాలలోకి వెళ్తే ఫన్నీయర్ గ్రామంలోని కొలత్తూమేడు ప్రాంతంలో ఈ నెల 1 వ తేదీన ఏకంగా 10 కాకులు మరణించి కనిపించాయి …దీంతో అక్కడ స్థానికులంతా కరోనా వల్ల మరణించాయి ఏమో అభిప్రాయపడ్డారు. కొందరు ఆహరం దొరకక ఎండ ఎక్కువై మరణించాయి అనుకున్నారు .కానీ తర్వాత కాకులు మరణాల సంఖ్య రోజురోజుకి పెరగడంతో ఆందోళన చెంది ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి అసలు కారణం తెలుసుకునేందుకు ప్రయత్నించారు.