Ads
నిర్మాత SKN గురించి అందరికీ పరిచయమే. ప్రొడ్యూసర్ గా టాక్సీవాలా, బేబీ లాంటి హిట్ సినిమాలను నిర్మించారు. అంతకు ముందు పిఆర్ఓ గా పనిచేసిన SKN ఎప్పుడు పూర్తిస్థాయి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.అయితే SKN ఎప్పుడు ఫంక్షన్లలో తన స్పీచ్ ల ద్వారా బాగా హైలైట్ అవుతూ ఉంటారు. తాజాగా ఆయన నిర్మించిన బేబీ మూవి బ్లాక్ బస్టర్ అయింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.
Video Advertisement
బేబీ సినిమా ప్రమోషన్స్ లోనూ సక్సెస్ మీట్ లోను SKN ఈ సినిమాని కల్ట్ మూవీ అంటూ, కల్ట్ బొమ్మ అంటూ ప్రచారం చేశారు… ఈ కల్ట్ అనే పదం ఆడియన్స్ లోకి విపరీతంగా వెళ్లిపోయింది. ఇప్పుడు అదే పేరును టైటిల్ గా నిర్మాత SKN ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. అయితే ఇది ఏ మూవీ కోసం అనే విషయం మాత్రం బయటికి చెప్పలేదు.
ప్రస్తుతం SKN ,బేబీ డైరెక్టర్ సాయిరాజ్ కలిసి పలు సినిమాలో నిర్మిస్తున్నారు. అందులో ఒకటి సుమన్ పాతూరి డైరెక్షన్ లో సంతోష్ శోభన్, దేత్తడి హారిక జంటగా వస్తుంది. అది కాకుండా బేబీ సినిమా కాంబినేషన్ అయినా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలతో మరో మూవీ ప్రకటించారు. ఈ రెండిటీలో ఏదో ఒక మూవీ కి కల్ట్ బొమ్మ అనే టైటిల్ పెట్టడం ఖాయంగా వినిపిస్తుంది. ఈ మూవీలు కూడా ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ థీమ్ తో తెరకెక్కుతున్నాయి. బేబీ మూవీ చేసినం మ్యాజిక్ ని ఈ సినిమాలో రిపీట్ చేస్తాయని నిర్మాత SKN కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. కల్ట్ బొమ్మ అనే టైటిల్ మంచి క్యాచీగాను, పాజిటివ్ గాను ఉంది.
End of Article