కరోనా వైరస్ కారణంగా విద్యుత్ బిల్లులు గత రెండు నెలలుగా ఆగిపోయిన విషయం విదితమే.కాగా లాక్ డౌన్ 5 తో ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టింది.దీంతో హైదరాబాద్ లో విద్యుత్ బిల్లులు మళ్ళీ పునప్రారంభం కానున్నాయి.అయితే జూన్ 3 వ తారీఖు నుండి ఈ విధానం మొదలవుతుంది.దీనిలో భాగంగా ప్రతిరోజు 250 ఇళ్లకు విద్యుత్ బిల్లులు జారీ చెయ్యనున్నానరు.అపార్టుమెంట్లయితే ప్రతిరోజు 450 కు పైగా బిల్లులు జారీ చేస్తారు.ఒక్కో ఇంటి నుండి ఇంకో ఇంటికి విద్యుత్ బిల్లులు జారీ చెయ్యడానికి వెళ్లిన వారు కచ్చితంగా సామాజిక దూరం పాటించాలని ,మాస్క్ లు ,శానిటైజర్ లు ఉపయోగించాలని ఇప్పటికే అధికారులు స్పష్టం చేసారు.

Video Advertisement

representative image

అయితే  2019  మార్చి,ఏప్రిల్ నెలలకు సంభందించిన బిల్లులను ప్రొవిజనల్ బిల్లులు అని అధికారులు నిర్ణయం తీసుకున్న విషయం విధితమే.అయితే ఆ రెండు నెలల బిల్లులను కొంతమంది చెల్లించగా కొంతమంది మాత్రం ఆ బిల్లులను ఇంకా చెల్లించలేదు.కాబట్టి విద్యుత్ బిల్లును రీడ్ చేసే డిజిటల్ మీటర్స్ లో ఈ రెండు నెలలకు సంభందించిన డేటా ను అమర్చే పనిలో అధికారులు ఉన్నారు.అయితే మార్చి,ఏప్రిల్ ,మే నెలల్లో ఉపయోగించిన మొత్తం యూనిట్లను మూడు నెలలకు ఏవరేజ్ గా లెక్కకట్టి ఒక్కో నెలకు ఎంత విద్యుత్ బిల్ చెల్లించాలో నిర్ణయిస్తారు.ఒకవేళ ఇంతకు ముందే ప్రొవిజనల్ బిల్ కట్టి ఉంటె ఇప్పుడు కట్టాలిసిన మొత్తం నుండి ఆ మొత్తని తీసివేస్తారు .