కరోనా ఎఫెక్ట్: కాష్ కౌంటర్ ప్లేస్ లో కుక్కర్…నోట్లు కాలకుండా ఏం చేస్తున్నారంటే?

కరోనా ఎఫెక్ట్: కాష్ కౌంటర్ ప్లేస్ లో కుక్కర్…నోట్లు కాలకుండా ఏం చేస్తున్నారంటే?

by Megha Varna

Ads

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు కరోనా బాధితుల సంఖ్య  పెరుగుతూనే ఉంది ..ఎంతోమంది చనిపోగా ,కొంతమంది మాత్రం ఈ వ్యాధితో పోరాడి బతికి బయట పడుతున్నారు.ఒకరి నుండి ఒకరికి వైరస్ సోకడం వలన సామాజిక దూరం పాటించి కరోనా ను అదుపు చెయ్యాలని దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ విధించాయి ..కానీ ఈ వైరస్ ఒకరి నుండి ఒకరికి సోకడమే కాకుండా ..ఈ వ్యాధి ఉన్నవారు ముట్టుకున్న వస్తువులను తాకినా ఈ వైరస్ వస్తుందనే ప్రచారం విస్తృతంగా జరిగింది ..

Video Advertisement

దీంతో శానిటైజర్ తో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటున్నారు.మాస్కులు  తప్పనిసరిగా ధరిస్తున్నారు ..ఆంధ్ర ప్రదేశ్ లో కరెన్సీ నోట్ల ద్వారా కూడా ఈ వ్యాధి సోకుతుందని విస్తృత ప్రచారం రావడంతో నోట్లను కూడా ముట్టుకునేందుకు ప్రజలు భయపడుతున్నారు .ఈ నేపథ్యంలో ఒక వ్యక్తికి వినూత్న ఆలోచన వచ్చింది ..మొదట కరెన్సీ నోట్లను కుక్కర్ లో ఉడకపెట్టాడు ..కానీ మొదట ఈ ప్రయత్నంలో ఫెయిల్ అయినా  తర్వాత సక్సెస్ అయ్యాడు ..

ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా  కైకలూరులో విజయలక్ష్మి జనరల్ స్టోర్స్ ను నరసింహ రావు అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు .అతని షాప్ లో కాష్ కౌంటర్ కాకుండా ఎలక్ట్రిక్ కుక్కర్ పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాడు .వ్యాపారంలో వచ్చిన డబ్బులను కుక్కర్లో వేస్తున్నాడు ..అది చూసిన వారంతా ఆశ్చర్యపోయారు .కుక్కర్ లో నీటి ఆవిరితో ఉడికించి …శానిటైజ్ చేస్తున్నారాయన..అలా  ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించగా ..డబ్బుల ద్వారా కరోనా సోకుతుందని విన్నాను కావున ఇలా చేస్తున్నాను అని సమాధానమిచ్చారు ..

 

మొదటగా ఈ ఆలోచన కార్యరూపం దాల్చినప్పుడు కరెన్సీ నోట్లు కుక్కర్ లో కాలిపోయావని ఆవేదన వ్యక్తం చేసారు .కొంచెం నీటిని అడుగున వేసి ..మధ్యలో రంద్రాలున్న ప్లేటును సిద్ధం చేసినట్లు తెలిపారు ..దీంతో నోట్లు కాలకుండా  నా ఆలోచన సక్సెస్ అయింది అని చెప్పారు ..ఆవిరిలో నోట్లను ఉంచడం వలన వైరస్ క్రిములు చనిపోతాయని నరసింహారావు తెలిపారు .


End of Article

You may also like