Home Biography డాడీ, చెప్పవే చిరుగాలి సినిమాల్లోని ఈ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

డాడీ, చెప్పవే చిరుగాలి సినిమాల్లోని ఈ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

by Mohana Priya

వేణు తొట్టెంపూడి నటించిన చిత్రాల్లో ప్రేక్షకాదరణ పొందిన వాటిలో ఒకటి చెప్పవే చిరుగాలి. ఇది ఉన్నై నినైత్తు అనే ఒక తమిళ సినిమాకి రీమేక్. ఇందులో హీరోగా సూర్య నటించారు. అయితే చెప్పవే చిరుగాలి సినిమాలో హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి మీకు గుర్తుండే ఉంటుంది. తన పేరు అషిమా భల్లా. అషిమా భల్లా అస్సాంలో పుట్టారు.

daddy heroine ashima bhalla

2001 లో వచ్చిన ప్యార్ జిందగీ హై అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తర్వాత డాడీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించారు అషిమా భల్లా. తర్వాత ఒక హిందీ సినిమాలో హీరోయిన్ గా, ఇంకొక హిందీ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించారు.

daddy heroine ashima bhalla

మెగాస్టార్ చిరంజీవి – వివి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన ఠాగూర్, తమిళ సినిమా రమణకి రీమేక్. ఠాగూర్ సినిమాలో శ్రియ పోషించిన పాత్రని రమణ సినిమాలో అషిమా భల్లా పోషించారు. తరువాత ఒక తమిళ సినిమా, ఒక హిందీ సినిమాలో నటించారు.  2004 లో వచ్చిన చెప్పవే చిరుగాలి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఇంకా చేరువయ్యారు అషిమా భల్లా.

daddy heroine ashima bhalla

ఆ తర్వాత ఒక కన్నడ, ఒక హిందీ సినిమాలతో పాటు నాయుడు ఎల్ఎల్బి అనే ఒక తెలుగు సినిమాలో కూడా నటించారు. తర్వాత రెండు తమిళ సినిమాల్లో నటించారు అషిమా భల్లా. అషిమా భల్లా చివరిగా తంబి అర్జున అనే తమిళ సినిమాలో నటించారు. అషిమా భల్లా సినిమాలతో పాటు హిందీలో రెండు సీరియల్స్ లో కూడా నటించారు. అలాగే రెండు రియాలిటీ షోస్ లో కూడా పార్టిసిపేట్ చేశారు.

daddy heroine ashima bhalla

2018 లో మేరే పాపా హీరో హీరాలాల్ అనే సీరియల్ లో నటించారు అషిమా భల్లా. అషిమా భల్లా ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటారు. అషిమా భల్లా కి వివాహం అయ్యింది. అందుకు సంబంధించిన వివరాలు ఏవీ ఎక్కడా లేవు. కానీ తన భర్త తో కలిసి దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఒక మంచి పాత్రలతో మళ్లీ అషిమా భల్లా ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం.

daddy heroine ashima bhalla

daddy heroine ashima bhalla

daddy heroine ashima bhalla

daddy heroine ashima bhalla daddy heroine ashima bhalla daddy heroine ashima bhalla daddy heroine ashima bhalla

daddy heroine ashima bhalla

You may also like