Ads
ప్రస్తుతం సినిమాలు థియేటర్లలో విడుదలైన 45 రోజులలోపే ఓటీటీలో వచ్చేస్తున్నాయి. ఎక్కువ శాతం ప్రేక్షకులు ఇంటి వద్ద నుంచి సినిమాలు చూడడానికి ఇష్టపడడంతో ఓటీటీ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను వెబ్ సిరీస్ ను అందించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక సినిమా విడుదలైన ఆరు నెలల తర్వాత సైలెంట్ గా ఓటీటీలో రిలీజైంది. ఇంతకీ ఆ మూవీ ఏంటో ?దాని వెనుక రీజన్ ఏంటో? ఓ లుక్కేద్దాం పదండి..
Video Advertisement
దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మరొక వారసుడు రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్. తేజ దర్శకత్వంలో ఇతను నటించిన ‘అహింస’ చిత్రం.. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులని ఒక రేంజ్ లో హింసించింది. సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియనంత సడన్గా వచ్చి వెళ్ళిపోయింది. ఆ తర్వాత టీవీలో కూడా ఈ మూవీ టెలికాస్ట్ అయింది కానీ ఇప్పటివరకు ఓటీటీ లోకి మాత్రం రాలేదు.
ఈ మూవీ సెట్స్ పై సుమారు రెండు ఏళ్ల పాటు సాగింది.. ఈ సంవత్సరం జూన్ 2న థియేటర్లలోకి వచ్చింది.. అయితే ప్రేక్షకులను అలరించలేక వచ్చినంత ఫాస్ట్ గానే వెళ్లిపోయింది. ఈ మూవీలో అభిరామ్ యాక్టింగ్ తో పాటు డైరెక్టర్ టేకింగ్ పై కూడా ఘోరంగా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అటు తేజాని ఇటు అభిరామ్ ను తెగ ట్రోలింగ్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. అయితే ఓటీటీ లో రిలీజ్ చేయడం మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రం ఎన్నాళ్లకు ఓటిటిలో అందుబాటుకి వచ్చింది.
End of Article