డాన్స్ తో దుమ్ము రేపుతున్న యువతి.. ఆ సమయంలో ఏం జరిగిందో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..?

డాన్స్ తో దుమ్ము రేపుతున్న యువతి.. ఆ సమయంలో ఏం జరిగిందో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..?

by Sunku Sravan

Ads

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. ఏ చిన్న విషయాన్ని కానీ నిమిషాల్లో ప్రపంచం మొత్తం చేరుస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా దునియాను ఏలుతుంది. దీని ద్వారా చాలామంది స్టార్ లుగా మారి వారి జీవిత గమనానికి బంగారు బాటలు వేసుకున్న వారు కూడా ఉన్నారు. అలాగే కొంతమంది దీని ద్వారా కటకటాల పాలైన వారు కూడా ఉన్నారు. ఈ తరుణంలో మనకు సోషల్ మీడియా అనేది అందివచ్చిన అవకాశం. దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తే మనకు ఆ విధంగానే రిజల్ట్ ఉంటుంది. దీని ద్వారా వారి వారి టాలెంటును నిరూపించుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

Video Advertisement

అలాంటి ప్రయత్నమే ఈ ఇద్దరు అమ్మాయిలు చేస్తుంటే మధ్యలో జరిగిన సంఘటన వల్ల వారు నవ్వుకుంటూ పారిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కామన్ గా అమ్మాయిలు కొత్తకొత్త స్టెప్పులతో అదిరిపోయే పర్ఫామెన్స్ లు ఇస్తున్నారు. ఈ వీడియోలను రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి రాత్రికి రాత్రే స్టార్ అయిపోతున్నారు. మొన్నటి వరకు భరత్ లో డాన్స్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకప్పుడు ఆడపిల్ల అంటే వంటగదికి పరిమితమయ్యే రోజులు ఉండేవి. కానీ ప్రస్తుతం ఆడదంటే అబల కాదు సబల అని నిరూపించే రోజులు వస్తున్నాయి.

అయితే ఇద్దరు యువతులు చేసిన డాన్స్ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే ఈ వీడియోలో కనిపిస్తున్న ఇద్దరమ్మాయిలు వారి ఇంటి బయటకు వచ్చి ఎవరూ లేరని తమ టాలెంట్ ను చూపించుకోవాలి అనుకున్నారు. ఒక అమ్మాయి మంచి పాటలు పెట్టింది. మరో అమ్మాయి పాటకు తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తుంది. ఈ డాన్స్ వీడియో మరో అమ్మాయి సెల్ ఫోన్ లో రికార్డు చేస్తుంది. ఇంతలో పక్కింటి నుండి ఎవరో వారిని గమనిస్తునట్లు చూశారు. వెంటనే ఇద్దరు యువతులు సిగ్గుతో లోపలికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారిపోయింది.

https://www.instagram.com/p/CV5Ho3ejWxt/?utm_source=ig_web_button_share_sheet


End of Article

You may also like