పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మలయాళ రీమేక్ అయ్యప్పనుమ్ కోషియుమ్ ఆధారంగా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమా సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని, అలాగే మొదటి పాటని కూడా విడుదల చేసారు. ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ అల్ ఇండియా రికార్డ్స్ కూడా సాధించింది. ఈ సినిమాపై హోప్స్ ఒక్కసారిగా పీక్స్ లోకి తీసుకెళ్లింది.

అయితే ఈ సినిమాలో రానా దగ్గుబాటి కూడా మరో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో డానియల్ శేఖర్ గా రానా దగ్గుబాటి నటిస్తున్నారు. ఇప్పటివరకు రానా దగ్గుబాటికి సంబంధించిన ఫోటో గాని వీడియో గాని బయటికి రాలేదు. మేకింగ్ వీడియోలో మాత్రం ఒకటి రెండు చోట్ల రానా కనిపిస్తారు. అయితే సినిమా బృందం డానియల్ శేఖర్ వీడియోని విడుదల చేయబోతున్నారు అని ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు ఈ విడుదల తేదీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక డేట్ వైరల్ అవుతోంది. సినిమా బృందం డానియల్ శేఖర్ వీడియోని సెప్టెంబర్ 17వ తేదీన విడుదల చేయబోతున్నారట. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.