స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగు ఇండస్ట్రీ లో బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన “మహానటి” సినిమాలో నటించిన కీర్తి సురేష్ సావిత్రిని మరిపించింది. ఆ సినిమా చూస్తున్నంతసేపు మనకి కీర్తి సురేష్ కనిపించదు. సావిత్రి గారే కనిపిస్తారు. అంతలా ఆమె నటించి మెప్పించింది.
భోళా శంకర సినిమాలో కీర్తి సురేష్ కూడా నటిస్తున్నారు. అలానే దసరా సినిమాలో కూడా కీర్తి సురేష్ నటిస్తున్నారు. దసరా చిత్రం కి సంబంధించి పోస్టర్ కూడా విడుదల అయింది. అయితే ఆ పోస్టర్ లో మనం కీర్తి సురేష్ ని చూడొచ్చు. కీర్తి సురేష్ దసరా ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు.

ఈ పోస్టర్ లో కీర్తి సురేష్ ని చూసిన ప్రేక్షకులు రంగస్థలం లో సమంత లాగ ఉంది ఏంటి అని అంటున్నారు. రంగస్థలం లో సమంత పసుపు రంగు చీర కట్టుకొని కనపడుతుంది. ఈ పోస్టర్ లో కీర్తి సురేష్ కూడా అలానే ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు దసరా సినిమాని దర్శకత్వం చేస్తున్నారు. నాని ఎప్పుడూ కూడా కొత్త దర్శకులని ప్రోత్సహిస్తుంటారు. ఈసారి కూడా ఒక కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 30న విడుదల అవుతుంది. నానికి ఈ స్క్రిప్ట్ బాగా నచ్చిందని ఈ సినిమాకి ఓకే చెప్పారట. అయితే ఈ సినిమా పోస్టర్ లో కీర్తి సురేష్ ని చూసి నెటిజన్లు అచ్చం రంగస్థలంలో సమంతలానే ఉందని అంటున్నారు.

రంగస్థలం సినిమా గురించి కొత్తగా చెప్పేదేముంది రంగస్థలం సినిమా అందరికీ నచ్చుతుంది. అందులో రామ్ చరణ్ ఎంతో అద్భుతంగా నటిస్తారు. అలానే సమంత కూడా యాక్టింగ్ ఇరగదీసింది. రామలక్ష్మి పాత్రతో సమంత అందరినీ ఎంతో బాగా ఆకట్టుకుంది.
Vennala is not just a name.
It’s an emotion ♥️Happy birthday to our chitthu chitthula bomma 🤗@KeerthyOfficial #Dasara pic.twitter.com/GHOCylIK79
— Hi Nani (@NameisNani) October 17, 2022
