మహానటి సినిమాలో సావిత్రి కూతురు పాత్ర పోషించిన ఆ పాప ఎవరో తెలుసా.?

మహానటి సినిమాలో సావిత్రి కూతురు పాత్ర పోషించిన ఆ పాప ఎవరో తెలుసా.?

by Mohana Priya

Ads

మన భారతీయ సినిమాలో ఎంతో మంది జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు వచ్చాయి. వారిలో క్రీడా రంగానికి చెందిన వారు, రాజకీయ రంగానికి చెందినవారు, సినిమా రంగానికి చెందినవారు, విద్యా, విజ్ఞాన, ఇంకా ఇతర రంగాలకు చెందిన ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. మన తెలుగులో కూడా చాలా బయోపిక్ సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి ప్రముఖ నటి సావిత్రి గారి జీవిత కథ ఆధారంగా వచ్చిన మహానటి సినిమా.

Video Advertisement

తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్స్ టాపిక్ వస్తే ఈ సినిమా ఖచ్చితంగా ఆ లిస్టులో టాప్ స్థానంలో ఉంటుంది. ఈ సినిమా కీర్తి సురేష్ కి స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది. అలాగే ఉత్తమ నటిగా కీర్తి సురేష్ నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఇందులో మరొక ముఖ్యమైన, అలాగే ప్రేక్షకులందరికీ చాలా నచ్చిన అంశం ఏమిటంటే అందులో ఉన్న పాత్రలు పోషించిన నటుల ఫీచర్స్ నిజ జీవితంలో ఉన్న మనుషుల ఫీచర్స్ కి దగ్గరగా ఉండటం. ఈ విషయంలో సినిమా మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

అందులోనూ ముఖ్యంగా సావిత్రి గారి హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ అంతా కూడా నిజంగా ఎలా ఉందో అలానే ప్రజెంట్ చేశారు. అందుకే కీర్తి సురేష్ ని చూస్తున్నంతసేపు సావిత్రి గారిని చూసినట్లు అనిపిస్తుంది. అయితే, ఈ సినిమాలో సావిత్రి గారి కూతురు విజయ చాముండేశ్వరి గారి చిన్నప్పటి పాత్ర పోషించిన పాప మీ అందరికీ గుర్తుండే ఉంటుంది.

daughter of savitri in mahanati

ఆ పాప తల్లి కూడా మనందరికీ తెలిసిన వ్యక్తే. ఆవిడ మంచి సింగర్ తో పాటు నటి కూడా. మహానటి సినిమాలో సావిత్రి గారి కూతురు పాత్ర పోషించిన పాప పేరు శివి. శివి ప్రముఖ సింగర్ స్మిత కూతురు. శివి కూడా పాటలు పాడుతుంది. యూట్యూబ్ లో తను పాడిన పాటల వీడియోలు కూడా ఉన్నాయి.


End of Article

You may also like