Home News తమిళనాడులో దారుణం…తల్లిని చంపేసి ఆమె రక్తంతోనే..?

తమిళనాడులో దారుణం…తల్లిని చంపేసి ఆమె రక్తంతోనే..?

by Mohana Priya

ఇటీవల తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. 42 ఏళ్ల ఉష మహిళ వ్యక్తి తన సొంత కూతుళ్ళ చేత హత్య చేయబడ్డారు. ఓపెన్ యూనివర్సిటీలో పని చేసిన ఉష తన ఇద్దరు కూతుళ్లతో కలిసి కేటిసి నగర్ లోని పాలయంకొట్టై లో ఉంటారు. వారి పేర్లు నీనా రీనా అని సమాచారం.  ఉష భర్త వారిని వదిలేసి వెళ్ళిపోయారు. ఉష ట్యూషన్స్ తీసుకునేవారు.

daughters stabbed mother in tamilnadu

ఈ మంగళవారం రోజు ఉష అసలు ఇంట్లో నుండి బయటకు రాకపోవడాన్ని స్థానికులు గమనించారు. అంతే కాకుండా కిటికీలు కూడా మూసి ఉన్నాయి తర్వాత ఆ ఇద్దరు అమ్మాయిలలో నుంచి ఒక అమ్మాయి బయటికి వచ్చి ఉష చనిపోయారు అని చెప్పింది. దాంతో చుట్టుపక్కల వాళ్ళు నెల్లై పోలీస్ కి సమాచారాన్ని అందించగా వారు వచ్చి ఇద్దరు అమ్మాయిలని తలుపు తియ్యమని అడిగారు.

daughters stabbed mother in tamilnadu

ఎంత సేపు అడిగినా కూడా తీయలేదు. కానీ చివరికి తలుపు తీసి చూడగా ఉష మంచం మీద ఉన్నారు. ఉష బట్టలకి రక్తం అంటుకొని ఉంది. ఆ అమ్మాయిలు ఉష మృతదేహం పక్కనే కూర్చొని ఒక బొమ్మ పెట్టుకుని, ఉష రక్తాన్ని ఆ బొమ్మకి పూస్తూ ఆడుకుంటున్నారు. వారిద్దరూ మాట్లాడలేకపోయారు. వారి దుస్తులకి కూడా రక్తం అంటి ఉంది. వారిద్దరి మొహాల్లో ఉష చనిపోయినందుకు ఏ ప్రభావం కనిపించడం లేదు.

daughters stabbed mother in tamilnadu

పోలీలసు కథనం ప్రకారం ఒక సోదరి ఇంకో సోదరికి బిస్కెట్స్ తినిపిస్తున్నారట. వారిద్దరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మృతదేహాన్ని అటాప్సీకి పంపించారు. ఇద్దరు అమ్మాయిలని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కి తీసుకెళ్లగా, వారిలో ఒక అమ్మాయి తన తల్లిని ఇనుప రాడ్‌ తో కొట్టి ఆ తర్వాత పొడిచి చంపినట్టు ఒప్పుకుంది. వారు మానసికంగా చికిత్స పొందిన తర్వాత వారి స్టేట్మెంట్ రికార్డ్ చేద్దామని పోలీసులు నిర్ణయించుకున్నారు.

You may also like