Home Biography వేదం, నిప్పు, మిరపకాయ్ హీరోయిన్ “దీక్షా సేథ్” గుర్తుందా.? ఇప్పుడెలా మారిపోయిందో చూడండి.!

వేదం, నిప్పు, మిరపకాయ్ హీరోయిన్ “దీక్షా సేథ్” గుర్తుందా.? ఇప్పుడెలా మారిపోయిందో చూడండి.!

by Mohana Priya

వేదం సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత ఎన్నో సినిమాల్లో తన నటనతో మనల్ని అలరించారు దీక్షా సేథ్. దీక్షా సేథ్ హల్ద్వాని లో జన్మించారు. దీక్ష తండ్రి ఐటిసి లిమిటెడ్ లో ఉద్యోగం చేసేవారు. దీక్ష తండ్రికి రెగ్యులర్ గా ట్రాన్స్ఫర్ అయ్యేది. దాంతో భారత దేశంలో చాలా చోట్ల దీక్ష నివసించారు. దీక్షకి ఒక అక్క ఉన్నారు. 2009 లో దీక్ష కాలేజ్ లో ఉన్నప్పుడు ఫెమీనా మిస్ ఇండియా కాంటెస్ట్ లో పాల్గొన్నారు.

deeksha seth present look

దీక్షకి మోడలింగ్ లో ప్రవేశం లేకపోయినా కూడా మిస్ ఇండియా కాంటెస్ట్ లో టాప్ టెన్ ఫైనలిస్ట్స్ లో ఒకరిగా నిలిచారు. అంతే కాకుండా మిస్ ఫ్రెష్ ఫేస్ టైటిల్ గెలుచుకున్నారు. హైదరాబాద్ లో ఒక మోడలింగ్ అసైన్మెంట్ కోసం వచ్చినప్పుడు వేదం సినిమా కాస్టింగ్ డైరెక్టర్ దీక్షా సేథ్ ని చూశారు. దాదాపు 70 మందిని రిజెక్ట్ చేసిన తర్వాత దీక్షా సేథ్ ఆ రోల్ కి సెలక్ట్ అయ్యారు. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి జోడిగా నటించారు దీక్షా సేథ్.

deeksha seth present look

ఆ తర్వాత తెలుగులో మిరపకాయ్, వాంటెడ్, నిప్పు, రెబెల్, ఊకొడతారా ఉలిక్కి పడతారా సినిమాల్లో నటించారు. తమిళ్ లో విక్రమ్ తో రాజా పట్టై, శింబు తో వెట్టై మన్నన్ సినిమాల్లో నటించారు. కానీ వెట్టై మన్నన్ సినిమా విడుదల అవ్వలేదు. 2014లో కపూర్ కుటుంబం వారసుడు అర్మాన్ జైన్ హీరోగా నటించిన లేకర్ హమ్ దివానా దిల్ సినిమాతో హిందీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు దీక్షా సేథ్.

deeksha seth present look

deeksha seth in lekar hum deewana dil

ఆ తర్వాత హిందీలో హౌస్ ఆఫ్ డెడ్ సినిమాలో నటించారు. తర్వాత కన్నడలో జగ్గు దాదా సినిమాలో నటించారు. 2016 లో సాత్ కదమ్ అనే హిందీ సినిమాలో చివరిగా నటించారు దీక్షా సేథ్. దీక్షా సేథ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ప్రస్తుతం దీక్ష సేథ్ ఇలా ఉన్నారు.

deeksha seth present look

deeksha seth present lookdeeksha seth present look

deeksha seth present look

deeksha seth present look 5

image credits: instagram/deekshaseth

You may also like