Home News క్రికెట్ గ్రౌండ్‌లో దీపక్ చాహర్ ప్రపోజ్ చేయడంపై … అతని సోదరి రియాక్షన్ ఇదే.!

క్రికెట్ గ్రౌండ్‌లో దీపక్ చాహర్ ప్రపోజ్ చేయడంపై … అతని సోదరి రియాక్షన్ ఇదే.!

by Mohana Priya

దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి, పంజాబ్ కింగ్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలర్ దీపక్ చాహర్ తన గర్ల్ ఫ్రెండ్ జయ భరద్వాజ్‌ కి అందరి మధ్యలో ప్రపోజ్ చేశారు. ఇది చూసిన తన గర్ల్ ఫ్రెండ్ మాత్రమే కాదు చుట్టూ ఉన్న వాళ్లు కూడా సర్ప్రైజ్ అయ్యారు.

deepak chahar sister reaction on proposal

మ్యాచ్ ముగిసిన వెంటనే దీపక్ చాహర్ స్టాండ్స్‌ లోకి వెళ్లి అక్కడ మ్యాచ్ చూస్తున్న గర్ల్ ఫ్రెండ్ ప్రపోజ్ చేశారు. దీపక్ చాహర్ అలా ప్రపోజ్ చేయడంతో తన గర్ల్ ఫ్రెండ్ సంతోషంగా ఒప్పుకున్నారు. అక్కడే ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ కూడా చప్పట్లు కొట్టారు. దాంతో ప్రేక్షకులందరూ, “ఆ అమ్మాయి ఎవరు?” అంటూ సోషల్ మీడియా మొత్తం తెగ వెతికేస్తున్నారు.

deepak chahar sister reaction on proposal

కొంత మంది ఏమో ఏకంగా,  “ఆ అమ్మాయి ఫారినర్” అని అంటున్నారు. ఈ నేపథ్యంలో దీపక్ చాహర్ సోదరి, మాలతి చాహర్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తన సోదరుడికి, జయ భరద్వాజ్ కి అభినందనలు తెలిపారు. అలాగే జయ భరద్వాజ్ ఫారినర్ అనే వార్తలకి స్పందిస్తూ ఈ విధంగా రాశారు, “నాకు వదిన దొరికింది. తను జయ భరద్వాజ్. తను ఫారినర్ కాదు. ఢిల్లీకి చెందిన అమ్మాయి. మీ ఇద్దరినీ దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను.” అని రాశారు.

deepak chahar sister reaction on proposal

image source: Malti Chahar (Instagram)

You may also like