Home Bigg Boss 5 telugu Bigg Boss Telugu-5: బిగ్‌బాస్‌లో మిగిలిన కంటెస్టెంట్స్ తో మాట్లాడకపోవడంపై స్పందించిన దీప్తి సునైనా..!

Bigg Boss Telugu-5: బిగ్‌బాస్‌లో మిగిలిన కంటెస్టెంట్స్ తో మాట్లాడకపోవడంపై స్పందించిన దీప్తి సునైనా..!

by Mohana Priya

బిగ్ బాస్ లో ఎవరు ఊహించని విధంగా రవి ఎలిమినేట్ అయ్యారు. ఫైనల్స్ వరకు వస్తారు అనుకున్న కంటెస్టెంట్స్ లో రవి ఒకరు. కానీ రవి ఎలిమినేట్ అవ్వడంతో ప్రస్తుతం షోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

“మా ఓట్లు మీద ఎలిమినేట్ అయ్యే వారిని నిర్ణయించనప్పుడు మేము ఓట్లు వెయ్యడం ఎందుకు? అసలు ఓటింగ్ పెట్టడం ఎందుకు?” అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. రవి కూడా తాను ఎలిమినేట్ అవుతాను అని ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అని బిగ్ బాస్ బజ్ లో చెప్పారు. ఇదిలా ఉండగా, గత వారం కంటెస్టెంట్స్ ని కలుసుకోవడానికి వారి కుటుంబ సభ్యులు వచ్చిన విషయం తెలిసిందే. ఇది మాత్రమే కాదు వీకెండ్ ఎపిసోడ్ లో కూడా కొంత మంది కుటుంబ సభ్యులు, స్నేహితులు వచ్చి కంటెస్టెంట్స్ ని పలకరించారు.

You may also like