Home Bigg Boss 5 telugu సన్నీ కామెంట్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ “దీప్తి సునైనా”..! ఏమన్నారంటే..?

సన్నీ కామెంట్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ “దీప్తి సునైనా”..! ఏమన్నారంటే..?

by Mohana Priya

బిగ్ బాస్ తెలుగు 5 లో నిన్నటి ఎపిసోడ్ లో సన్నీ, సిరీ, షణ్ముఖ్ మధ్య పెద్ద గొడవ జరిగింది. మాటా మాటా పెరిగి షన్ముఖ్ కి, సన్నీకి మధ్య వివాదం మొదలైంది. సన్నీ ఒక మాట అన్నప్పుడు అది వేరే లాగా అర్థం అవడం, దానికి షణ్ముఖ్ మరొక రకంగా జవాబు ఇవ్వడంతో చిన్న గొడవ కాస్త చాలా పెద్దది అయ్యింది.

ఆ వివాదంలో భాగంగానే షణ్ముఖ్, “యూట్యూబ్లో ఇలాంటి కామెంట్స్ చాలా చూసాను” అని అన్నారు. “అది యూట్యూబ్ వరకే గుర్తుపెట్టుకో” అని సన్నీ అన్నారు.

Deepthi Sunaina reply to sunny and shanmukh discussion

అందుకు షణ్ముఖ్ “నేను యూట్యూబ్ నుండి వచ్చాను” అంటే సిరి కూడా నేను కూడా యూట్యూబ్ నుండి వచ్చానని అన్నారు. సన్నీ అన్నది ఒకటి అయితే అది వీరికి వేరే లాగా అర్థం అవ్వడంతో అంత సేపు చర్చ జరిగింది. అయితే, ఈ విషయంపై షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా స్పందించారు. ఇంస్టాగ్రామ్ స్టోరీలో సన్నీపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీప్తి. అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అర్థం వచ్చేలాగా దీప్తి ఒక పోస్ట్ షేర్ చేశారు.

Deepthi Sunaina reply to sunny and shanmukh discussion

“నువ్వు ఒక్కడివే బెస్ట్ కనుక్కో తప్పులేదు. కానీ మిగతా అందరినీ ఎందుకు అలా చూస్తున్నారు? చేతకాని ఆటలు ఆడుతున్నారు ఏంటి? ఫిజికల్‌ అయ్యి గట్టి గట్టిగా అరిస్తే గేమ్ ఆడినట్లా? ఫిజికల్‌ అవ్వడం కన్నా కష్టం అయిన టాస్క్‌ మైండ్‌తో ఆడటం” అంటూ దీప్తి పేర్కొన్నారు అలాగే షణ్ముఖ్ గురించి కూడా మాట్లాడుతూ, నాది తప్పు అయితే నేర్చుకుంటారా, ఎంత బాగా చెప్పావ్ షన్నూ నీ ఇష్టం మరింత పెరిగింది” అని రాశారు.

You may also like