Home Bigg Boss 5 telugu Bigg Boss Telugu -5 : “అతనికి ఏం చేయాలనిపిస్తే అది చేయనివ్వండి.!” అంటూ… షణ్ముఖ్ కి దీప్తి సునైనా సపోర్ట్..!

Bigg Boss Telugu -5 : “అతనికి ఏం చేయాలనిపిస్తే అది చేయనివ్వండి.!” అంటూ… షణ్ముఖ్ కి దీప్తి సునైనా సపోర్ట్..!

by Mohana Priya

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చివరి వారంలోకి ఎంటర్ అయింది. గత వారం జరిగిన ఎలిమినేషన్‌లో కాజల్ ఇంటి నుంచి బయటికి వచ్చేశారు. ఫైనలిస్ట్ లుగా సన్నీ, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, మానస్ నిలిచారు. వచ్చే వారం గ్రాండ్ ఫినాలే జరగబోతోంది.

ఈ చివరి ఎపిసోడ్‌కి అతిధులుగా ప్రముఖ సెలబ్రిటీలు వస్తారని సమాచారం. ఎపిసోడ్ కూడా చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసారట. షణ్ముఖ్ టాప్ 5 ఫైనలిస్ట్ లలో ఒకరు. షణ్ముఖ్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో, అన్నే నెగటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా దీప్తి సునైనా ఈ విధంగా రాసారు.

deepthi sunaina resopons supports shanmukh in bigg boss telugu 5

“కంక్లూజన్స్ కి రావద్దు. బిగ్‌బాస్‌ని చూసి అతని క్యారెక్టర్ మొత్తాన్ని అంచనా వేయకండి. ఇది కేవలం ఒక షో మాత్రమే అని గుర్తుంచుకోండి. అతను చాలా మంచి వ్యక్తి. అతను ఏమి చేయాలనుకుంటే అది చేయనివ్వండి. తను ఏం చేయాలో తనని నిర్ణయించుకోనివ్వండి. అతను మీ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వాలి అని అనుకోకండి. మీకు నచ్చినట్టు కాకుండా వాడికి నచ్చినట్టు ఉండనివ్వండి. దయచేసి మీకు ఇష్టమైన కంటెస్టెంట్ కి సపోర్ట్ చేయండి. నేను ఇప్పటికీ, ఎప్పటికీ షణ్ముఖ్‌కు మద్దతు ఇస్తాను. నేను అతనిని సంతోషంగా చూడాలనుకుంటున్నాను” అని రాసారు.

You may also like