Home Filmy Adda Vijay Sethupathi : విజయ్ సేతుపతిపై పరువు నష్టం దావా..? అసలేం జరిగిందంటే..?

Vijay Sethupathi : విజయ్ సేతుపతిపై పరువు నష్టం దావా..? అసలేం జరిగిందంటే..?

by Mohana Priya

ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతిపై మహా గాంధీ అనే నటుడు పరువు నష్టం దావా వేశారు. గత కొద్ది రోజుల క్రితం విజయ్ సేతుపతిపై విమానాశ్రయంలో దాడి జరిగిన సంఘటన తెలిసిందే. అయితే, బీబీసీ కథనం ప్రకారం, గాంధీ, విజయ్ సేతుపతిపై దాడి చేయలేదని, అతని మేనేజర్ జాన్సన్‌పై దాడి చేశారని పోలీసులు తెలిపారు.

ఇప్పుడు గాంధీ విజయ్ సేతుపతిపై కేస్ వేసారు. గాంధీ తన పిటిషన్‌లో, “వైద్య పరీక్షల కోసం బెంగళూరు వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళ్లాను. అక్కడ విజయ్ సేతుపతిని చూశాను. ఆయన సినీ పరిశ్రమలో సాధించిన ఘనతకు అభినందనలు తెలపాలి అనుకున్నాను. అయన దీనికీ నిరాకరించడంతో పాటు కులం పేరుతో బహిరంగంగా దూషించారు” అని తెలిపారు.

defamation suit filed against vijay sethupathi

గాంధీ తరపు న్యాయవాది దినేష్ మాట్లాడుతూ, “ఈ ఘటనలో గాంధీ చెవి దెబ్బతింది. విజయ్ సేతుపతి మీడియాతో మాట్లాడుతూ, ఆ వ్యక్తి మత్తులో ఉన్నారు అని చెప్పారు. దీని వల్ల గాంధీ పరువుకు భంగం కలిగింది. దాంతో అయన 6 సినిమాల్లో నటించే అవకాశం కోల్పోయారు. అందుకే సైదాపేట కోర్ట్ లో 3 కోట్ల పరువు నష్టం దావా వేసాం” అని అన్నారు.

You may also like